అనుష్క ప్రభాస్‌ల ప్రేమ పెళ్ళి
అనుష్క ప్రభాస్‌ల ప్రేమ పెళ్ళి
అనుష్క శెట్టి-బాహుబలి ప్రభాస్ అంటే టక్కున వచ్చే ఆలోచన వీరిద్దరూ గత కొన్ని ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. రేపో మాపో పెళ్లి చేస్కోబోతున్నారు. అన్న పుకార్లు ఎక్కువయ్యాయి. మామూలుగా చూడడానికి కూడా వారిద్దరూ జంటగా చాలా బావుండడంతో అందరూ వీరిద్దరూ ఒకటైతే బావుంటుందన్న ఉద్దేశ్యం చాలా మందిలో ఉంది.
ఇక కొంతమందైతే ఇంకొంచం ముందుకి వెళ్ళి వీరిద్దరి ఇళ్ళలో ఆల్రెడీ పెద్దలు ఒప్పేసుకున్నారని. పెళ్ళికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయని .ఇక మూడు ముళ్ళతో వారిద్దరూ ఒక్కటే తరువాయి అని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ విమర్శకులు ,విశ్లేషకులతో సహా స్వీటీ ,డార్లింగ్ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా మొదలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలను స్ప్రెడ్ కూడా చేశారు.
అయితే తాజాగా సాహోప్రమోషన్స్లో పాల్గొన్న ప్రభాస్ కు ఓ మీడియా నుంచి వచ్చిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. నాకు, అనుష్క మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదని అవన్నీ అవాస్తవాలని . ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మేమిద్దరం సంతోషం చట్టాపట్టాలేసుకుని ఎక్కడో తిరిగేవాళ్ళం కదా. ఈ విషయాన్నిదాచాలన్సిన అవసరం ఏముందన్నారు. అలాగే అనుష్క కు అయినా నాకయినా పెళ్ళయితేగాని ఈ గాసిప్స్ ఆగేలా లేవన్నారు. ఈసారి కలిసి నప్పుడు కనీసం అనుష్కనైనా త్వరగా పెళ్ళి చేసుకోమని అడుగుతానని అన్నారు.
త్వరలోనే పెళ్లి చేస్కోబోతున్నాం అని వార్తలు వస్తున్నాయి .ఇప్పటివరకు నన్ను చాలా మంది అడిగారు .అయితే అవన్నీ అబద్ధాలే .ప్రభాస్ నాకు మంచి మిత్రుడు .ఎప్పటికి అతనితో స్నేహం కొనసాగుతుంది .అయితే అతన్ని మాత్రం ఎప్పటికి అన్నయ్య అని పిలవను అని ఆమె అణుబాంబు పేల్చారు .అయితే నిప్పు లేనిది పొగ రాదన్నట్లు అమ్మడు ఇంత క్లారీటీ ఇచ్చిన కానీ వారిద్దరూ లవ్ లో ఉన్నారు అని కాదనలేని సత్యం అని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి