ఈ ఏడాది`ఇస్మార్ట్ శంకర్`… వచ్చే ఏడాది `ఆర్ ఆర్ ఆర్`?
ఈ ఏడాది`ఇస్మార్ట్ శంకర్`… వచ్చే ఏడాది `ఆర్ ఆర్ ఆర్`?
`దృశ్యం` (2014), `బాహుబలి – ది బిగినింగ్` (2015), `పెళ్ళి చూపులు` (2016), `ఫిదా` (2017), `ఆర్ ఎక్స్ 100` (2018).. ఇలా గత ఐదేళ్ళుగా జూలై నెలలో కనీసం ఒక బ్లాక్‌బస్టర్ మూవీ అయినా నమోదు అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో… ఈ సంవత్సరం కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది. దీన్ని కొనసాగించే చిత్రంలా `ఓ బేబీ` కనిపించినా… అది జస్ట్ హిట్ ఫిల్మ్‌గానే నిలచిందే తప్ప బ్లాక్‌బస్టర్ అనిపించుకోలేకపోయింది. అయితే… ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన `ఇస్మార్ట్ శంకర్` ఆ బ్లాక్‌బస్టర్ పరంపరని కొనసాగించింది. కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాల్లోనూ లాభాల బాట పట్టిన ఈ సినిమా… ఇంకా వసూళ్ళ వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతోంది. మరి… వచ్చే ఏడాది జులై సెంటిమెంట్‌ని కంటిన్యూ చేసే బ్లాక్‌బస్టర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` అవుతుందేమో చూడాలి. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ బడా మల్టీస్టారర్ 2020 జూలై 30న రాబోతోంది