చరణ్బాలీవుడ్ అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్

చరణ్బాలీవుడ్ అయితే ఎన్టీఆర్‌కు హాలీవుడ్
బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. క్వాలిటీ విషయంలో రాజీ పడని దర్శకుడిగా పేరున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి భారీ సినిమాల ఓపెనింగ్స్ కు బావుంటాయి. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించారు. 2020 జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు రాజమౌళి. అయితే సంవత్సరాల తరబడి ఒకే సినిమాను తీసే రాజమౌళి విడుదల తేదీపై మాత్రం చాలా పక్కాగా వ్యవహరిస్తారు. అందులోనూ సెంటిమెంట్‌ను కూడా ఫాలో అవుతారు. తాజాగా ‘RRR’ సినిమా విషయంలోనూ అదే సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు.
ఇక ఇదిలా ఉంటే రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలీయాభట్ను ఎంచుకోగా. ఎన్టీఆర్ కోసం ఒక హాలీవుడ్ భామ కోసం రాజమౌళి దేశాలన్నీ జల్లెడ పట్టారనే సమాచారం. కథ ప్రకారం ఎన్టీఆర్ ఓ హాలీవుడ్ భామను ప్రేమించాలి. ఈ నేపధ్యంలో చాలా అందమైన భామ కోసం ఎంతో కష్టపడి రాజమౌళి ఇద్దర్ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే వారిలో ఒకరు బ్రిటీష్ భామ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు కానీ ఆమె ఎందుకో సెట్ అవ్వలేదనుకుని ఆమెను తప్పించి మరో హాలీవుడ్ నటి ఎమ్మారాబట్స్ ని తీసుకున్నారని సమాచారం. అయితే ఈ సస్పెన్స్ మరెన్ని రోజులో ఉండదు. ఇంకో వారంలోనే ఆ భామ ఎవరనేది రాజమౌళి నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఇక రాంచరణ్ కాస్త సైరా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కూడా షూటింగ్లో చిన్న గాయం వల్ల కాస్త విశ్రాంతిలో ఉన్నారు. తిరిగి మళ్ళీ ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది