దివ్యాంగునికి త్రిచక్రవాహనాన్ని అందించిన కేటీఆర్
దివ్యాంగునికి త్రిచక్రవాహనాన్ని అందించిన కేటీఆర్
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదంలో గాయపడి తన కాళ్ళు పోగొట్టుకున్న దివ్యాంగుడు సాగర్ కి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు త్రిచక్ర వాహనాన్ని అందించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంభోజ సాగర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ జరిగిన ట్రక్కు ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత స్వదేశానికి చేరుకొని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు తన అంగవైకల్యం అడ్డుగా వస్తున్న విషయాన్ని కేటిఆర్ కి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం పల్లి రవీందర్ రెడ్డి కాంభోజ సాగర్ కు త్రిచక్ర వాహనాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు చేతుల మీదుగా దివ్యాంగుడు సాగర్ కు వాహనాన్ని అందించడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ చక్ర వాహనాన్ని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని గడ్డంపల్లి రవీందర్ రెడ్డి తెలిపారు. సాగర్ జీవనోపాధి కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.