పండగలను టార్గెట్ చేసుకున్న చైతూ
వేసవికి విడుదలైన `మజిలీ`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం తన మేనమామ వెంకటేశ్‌తో కలసి `వెంకీమామ`లో నటిస్తున్న చైతూ… ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ రెండు చిత్రాలు కూడా పండగలనే టార్గెట్ చేసుకుని విడుదల కాబోతున్నాయి.
`వెంకీమామ` విజయదశమి కానుకగా విడుదల కానుండగా… శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమై క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది. మరి… పండగలనే టార్గెట్