పి.వి.పి సినిమా బ్యానర్లో అడివిశేష్ హీరోగా నటిస్తోన్న `ఎవరు` ఆగస్ట్ 15న విడుదల
పి.వి.పి సినిమా బ్యానర్లో అడివిశేష్ హీరోగా నటిస్తోన్న `ఎవరు` ఆగస్ట్ 15న విడుదల
`క్షణం`, `అమీ తుమీ`, `గూఢచారి` వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`. `బలుపు`, `ఊపిరి`, `క్షణం` వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. వెంకట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లుక్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. `క్షణం` వంటి సూపర్‌హిట్ తర్వాత అడివిశేష్, పివిపి సినిమా కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు.
నటీనటులు:
అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: వెంకట్ రామ్‌జీ, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అవినాష్ కొల్ల, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డైలాగ్స్: అబ్బూరి రవి, కాస్ట్యూమ్స్: జాహ్నవి ఎల్లోర్, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజ్,