పూరీ కిరికిరి

పూరీ కిరికిరి
హిట్లు ఇస్తున్న దర్శకులతోనే మహేష్‌బాబు వర్క్ చేస్తాడని పూరీ జగన్నాధ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పూరి, మహేష్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. పోకిరి సినిమా ఇద్దరి కెరియర్ని మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన బిజినెస్‌మేన్ కూడా బాక్సాపీస్ ముందు హిట్ అయింది. అయితే అసలు కథ ఇక్కడే ఉంది. అవి రెండు సినిమాలు హిట్లు ఇచ్చిన పూరి తర్వాత మహేష్ దగ్గరకి వెళ్ళి ఆయనను కలిసినా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. అందువల్ల పూరి మహేష్‌బాబుని నిందించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అలా నిందించడం మహేష్ ఫ్యాన్స్‌కి మింగుడు పడడం లేదు.
హిట్లు ఇచ్చి మంచి ఫామ్‌లో ఉన్న దర్శకులకే మహేష్ డేట్స్ ఇస్తాడంటే… మరి పోకిరి పోకిరి చిత్రానికి ముందు పూరి పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ క్వశ్చ్న్. బాలీవుడ్లో ఒక చిత్రం ఫ్లాప్ అవ్వగా ఆంధ్రావాలా అనే అట్టర్‌ఫ్లాప్ కూడా ఉంది. ఏక్‌నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి ఇలా వరుసగా ఎన్నో ఫ్లాప్‌ల ఇస్తున్న సమయంలో పూరిని పిలిచి మరీ బిజినెస్‌మేన్ ప్లాన్ చేశాడు. బిజినెస్‌మేన్ సినిమా ఒప్పుకునే ముందు మహేష్ దూకుడు వంటి సెన్సేషనల్ సూపర్‌హిట్ చేశాడు. మరి అదే సమయంలో వరుస ఫ్లాప్‌లలో ఉన్న పూరితో సినిమా చేయడం సరైనదేనా. ఇలాంటి ప్రశ్నలతో పూరీని ఆడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.