పెళ్లి కాని ప్రభాస్‌కు పెళ్ళి కాబోతుంది…
పెళ్లి కాని ప్రభాస్‌కు పెళ్ళి కాబోతుంది…
తెలుగు సినీ చరిత్రలో రికార్డుల వర్షం కురిపించి దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసిన సినిమా బాహుబలి .. ఆ సినిమా హీరో ప్రభాస్ .. ఒక్క సినిమాతో భారీ సినిమాల హీరో అయిపోయాడు .. ఉత్తరాదిన , దక్షిణాదిన పెద్ద బడ్జెట్ సినిమా హీరో ఖ్యాతి పొందాడు .. బాహుబలి తరువాత ఆ బడ్జెట్ కు ఏమాత్రం తగ్గకుండా ` సాహో ` సినిమాను తయారు చేస్తున్నాడు ..
ఈ సినిమా గోలంతా పక్కన పెడితే ప్రభాస్ కు ఇంకా పెళ్లి కాలేదు .. ప్రభాస్ వయసు ఇప్పుడు 40 ఏళ్ళు .. పెళ్లి కానీ ప్రభాస్ కు చాలా సంబంధాలే వస్తున్నాయట .. ఆ మధ్య బాహుబలి హిట్ తో పాటు .. బిర్లా , మిర్చి , బాహుబలి రెండు పార్టులుతో కలిపి నాలుగు సినిమాలు ప్రభాస్, అనుష్క కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ లు సాధించాయి .. దీంతో అందరూ ఈ హిట్ కాంబినేషన్ సినిమా లోనే కాదు నిజజీవితం లో కూడా అలానే ఉంటె బావుంటుందని కోరుకోవడం లో తప్పులేదు.. దీని కోసం ఉదాహరణలు కూడా మన నెటిజెన్ల పెట్టేసుకున్నారు .. అయితే వారు అనుకున్నట్టు ఏమీ జరగలేదు ..
ప్రభాస్ , అనుష్కలు ఆ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టేసారు .. ఇప్పుడు కొత్త గా ఒక వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నది .. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి తో ప్రభాస్ పెళ్లి కుదిరిందని , పెద్దవాళ్ళతో మాటలు గట్రా జరుగుతున్నాయని తెలియవచ్చింది .. దీనికి సంబంధించిన ఏ విషయాన్నీ ప్రభాస్ కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించలేదు .. కాబట్టి ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే ..
అలాగే తెలుగులో కొన్ని హిట్ కాంబినేషన్స్ పెళ్ళిళ్ళు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణ కృష్ణ, విజయనిర్మల, రాజశేఖర్జీవిత, అమల, నాగార్జున, ఊహా, శ్రీకాంత్, జ్యోతిక, సూర్య వీళ్ళు నటించిన చిత్రాలు ఎక్కువగా విజయాలు సాధించడంతో నిజ జీవితంలో కూడా వీరు జీవిత భాగస్వాములు కాగలిగారు. అదే తరహాలో ప్రభాస్ అనుష్క నటించిన బిర్లా, మిర్చి, బాహుబలి-1 బాహుబలి-2 ఇవి నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించడంతో వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారన్న వార్త కూడా సహజంగా అందరూ అనుకుంటుంటారు. ఏది ఏమైనప్పటికీ మన బాహుబలి పెళ్ళి కోసం చాలా మంది వెయిటింగ్ త్వరలో పెళ్లి కానీ ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కాలని ఆశిద్దాం ..