మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న జాతీయ ఉత్తమ నటికి కీర్తి సురేష్
మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న జాతీయ ఉత్తమ నటికి కీర్తి సురేష్
`మహానటి` చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కీర్తిపై పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహ లో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో కీర్తి దర్శనమిచ్చారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ ముచ్చట్లాడారు. మెగాస్టార్ సైతం చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం కన్నులపండువగా కనిపిస్తోంది.