మధ్యతరగతి యువకుడిగా అఖిల్?

‘మిస్టర్ మజ్ను’ తర్వాత దాదాపు ఆరు నెలల గ్యాప్ తీసుకున్న అఖిల్… ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం… ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి దశ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో భాగంగా అఖిల్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో అఖిల్ చేస్తున్న క్యారెక్టర్‌కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో ఎగువ మధ్యతరగతి కుటుంబ యువకుడిగా భావోద్వేగాలకు ఆస్కారమున్న పాత్రలో కనిపించనున్నాడట అఖిల్. అంతేకాదు… కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా… ‘బన్నీ’వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి… ఈ సినిమాతోనైనా అఖిల్‌కి సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూడాలి.