రేణూ క్రేజ్ మామూలుగా లేదుగా….?
రేణూ క్రేజ్ మామూలుగా లేదుగా….?
ఎక్కడో మారుమూల ఓ పల్లెలో పాటపాడుకునే బేబి. ఆ మధ్య బాగా ఫ్యామస్ అయింది. ఓ పల్లెటూరు నుంచి వచ్చిన ఆమె ఒక్కరోజులోనే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. సంగీత ప్రియులు తన గాత్రానికి మైమరచిపోవడమే కాదు ఆశ్చర్యపోయారు. ఒక్క ముక్క చదువురాని ఆమె.. ఇంత చక్కగా పాడుతుందా అని అబ్బురపడ్డారు. ఇదే తరహాలో బెంగాల్‌కు చెందిన రేణూ మోండల్ అందరి దృష్టిని ఆకర్షించింది. రణఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడే ఆమె… ఇప్పుడు బాలీవుడ్లో గాయనిగా మారిపోయింది.
ఆమెను చూస్తే చింపిరి జట్టు.. తినడానికి తిండి లేక బాధపడుతున్న నిరుపేద మహిళగా కనిపిస్తుంది. కాని స్వరం మాత్రం ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ను గుర్తు చేస్తుంది. బెంగాల్‌లోని రణఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ తిరిగే ఆమె పేరే… రేణూ మోండల్.ప్లాట్‌ఫామ్‌పై ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ అనే పాట పాడుతుండగా… ఆ వినసొంపైన గాత్రానికి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆమె పాటను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ మహిళ పాట… స్థానికులతోపాటు నెటిజన్ల మనసునూ గెలుచుకుంది .రేణు పాట విన్న ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేష్మియా.. తను తీస్తున్న సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం కల్పించాడు. రికార్డింగ్ థియేటర్లో రేణు పాడుతున్నప్పుడు తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
రైల్వే స్టేషన్‌లోని కచేరీ బాలీవుడ్ సినిమా ‘హ్యాపీ హార్డి అండ్ హీర్’లో అవకాశం తెచ్చిపెట్టిందని… మంచి సింగర్‌గా మరింత పేరు తెచ్చుకోవాలని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పడు ఈమె గాత్రానికి బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కూడా ఫిదా అయ్యారు. ఆమె గాత్రానికి ముగ్ధుడైన సల్మాన్ ఆమెకు ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చాడు. అదేంటా… అని ఆలోచిస్తున్నారా 55 లక్షలు ఖరీదు చేసే ఓ ఇంటిని ఆమెకు కానుక గా ఇచ్చారు. అంతేకాదు తన తర్వాత చిత్రం దబాంగ్-3లో ఓ పాట పాడే అవకాశం కల్పించినట్లు బి-టౌన్ వర్గాలు తెలిపాయి.