‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్
‘వాల్మీకి’పై హైకోర్టులో పిటిషన్
వరుణ్‌తేజ్-హరీష్ శంకర్ తొలి కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్మీకి’. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు.
వాల్మికీ టీజర్లో వరుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్ లుక్ చాలా కొత్తగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ప్రీ టీజర్‌తోపాటు అధర్వ లుక్‌ని కూడా విడుదల చేశారు. వరుణ్‌తేజ్, అధర్వ ఉన్న ఈ పోస్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా డైలాగ్స్‌తో మ్యాజిక్ చేసే విధంగా హరీష్ శంకర్ సినిమా టీజర్ ఉంటుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. దానికి భిన్నంగా ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఈ ప్రీ టీజర్‌ను డిఫరెంట్‌గా క్రియేట్ చేసి బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు హరీష్ శంకర్.
అయితే ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ పై ఒక వివాదం నడుస్తుంది. ఈ సినిమా యొక్క టైటిల్‌ని మార్చాలంటూ వాల్మీకి బోయ హక్కుల సమితి తెలంగాణ హైకోర్టులో పిటిషన్దాఖలు చేసింది. తమ హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని ఈ చిత్ర బృందం పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారి పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ‘వాల్మీకి’టైటిల్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఇకపోతే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈమధ్య కాలంలో ఇలాంటి చాలా ఎక్కువయిపోయాయి. ఒక సినిమాని సినిమాలాగా చూడటం లేదు. ప్రతిదానికి ఏదో ఒక లోపం చూపి ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. అది సినిమా హైప్ కోసమే లేక నిజంగానే అలాంటివి జరుగుతున్నాయా అన్న విషయం అర్ధంకావడంలేదు.