సెంటిమెంట్ కంటిన్యూ చేసిన `ఇస్మార్ట్ శంకర్`
`టెంపర్` తరువాత సరైన విజయం లేని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ని మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకువచ్చిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా గురువారం విడుదలై వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు… ప్రాఫిట్ జోన్లోకి కూడా వెళ్ళే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రెండు రోజుల వసూళ్ళు చూస్తే… `ఇస్మార్ట్ శంకర్` రాంపేజ్ బాక్సాఫీస్ వద్ద మాములుగా లేదనిపిస్తోంది.
ఇదిలా ఉంటే… `ఇస్మార్ట్ శంకర్`తో పూరికున్న ఓ సెంటిమెంట్ నాలుగోసారి కూడా వర్కవుట్ అయినట్లయ్యింది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే… `ఎ` సర్టిఫికేట్ వచ్చిన పూరి సినిమాలు హిట్ లిస్ట్‌లో చేరడం. `పోకిరి`, `దేశముదురు`, `బిజినెస్‌మేన్`… ఇలా ఇప్పటికే మూడు సార్లు `ఎ` సర్టిఫికేట్‌తో మూడుసార్లు బ్లాక్‌బస్టర్స్ అందుకున్న పూరి… `ఇస్మార్ట్ శంకర్`తో `ఇస్మార్ట్`గా `ఎ` సెంటిమెంట్‌ని కంటిన్యూ చేసి నాలుగోసారి ఘనవిజయం అందుకున్నాడు. మరి… మున్ముందు కూడా పూరికి ఈ సెంటిమెంట్ కొనసాగుతుందేమో చూడాలి.