సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘నిన్ను తలచి’
సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘నిన్ను తలచి’
ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి. క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమాతో వంశీ యాకసిరి, స్టెఫీ పటేల్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. . ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదలచేస్తున్నట్లు గా నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…
దర్శకుడు తోట అనిల్ మాట్లాడుతూ… ఈ చిత్రం సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ చిత్రానికి మీరిచ్చిన ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
హీరో వంశీ మాట్లాడుతూ… ఈ నెల 27న నిన్ను తలచి మీ ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మేము ప్రేక్షకులకు ఒక చిన్న కంటెస్ట్ లాంటిది పెట్టాము. మెట్రోకి వెళ్లి మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు మా తరపు నుంచి 200 రూ. రీచార్జ్ కార్డులను గిఫ్ట్‌గా ఇవ్వనున్నాం. ఇది నా డెబ్యూ మూవీ మీ అందరి ఆదరణ తప్పకుండా కావాలి. మీరందరూ సినిమా చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ స్టెఫీ పాటిల్ మాట్లాడుతూ… ఈ చిత్రం 27న విడుదల కానుంది. మీరందరూ ఈ చిత్రానికి మొదటి నుంచి చాలా మంచి ఆదరణ ఇస్తున్నారు. అందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా ప్రొడ్యూసర్ వంశీగారు కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనే ఒక కంటెస్ట్ని నిర్వహించారు. మెట్రోవాళ్లతో రేపటి నుంచి మేం ఆ పనిలో ఉంటాము. అలాగే నా కో యాక్టర్ వంశీ చాలా మంచివాడు. నాకు సెట్స్‌లో తన సహాయ సహకారాలను అందించేవాడు.
ప్రొడ్యూసర్ అజిత్ మాట్లాడుతూ… 27న విడుదలవుతున్న మా చిత్రానికి మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి. మీరందరూ ఈ చిత్రాన్ని చూసి మీ సపోర్ట్‌ని అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.