అదృశ్యమా … ఆత్మాహుతా …
అదృశ్యమా … ఆత్మాహుతా …
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు సిద్దార్థ మాయమయ్యాడు .. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సిద్ధాంతం తో స్వయం కృషి తో పైకి వచ్చిన సిద్దార్థ ఎందిరికో ఆదర్శం .. కానీ ఈ మధ్య ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో మానసికంగా క్షోభ అనుభవించిన సిద్దార్థ తన కంపెనీ ఉద్యోగులకు ఒక లేఖ రాసి కారు దిగి అలా వెళ్లిపోయాట్ట .. ఇంతవరకూ ఆచూకీ దొరకలేదు .. చిన్న స్థాయి నుంచి ప్రయాణం ప్రారంభించి వందల కోట్లకు అధిపతి అయిన సిద్దార్ధ ఇప్పుడు అదృశ్యమయ్యాడా .. ఆత్మాహుతి చేసుకున్నాడో తెలియడం లేదు .. సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ అలా నిరుత్సాహ పడడం కరెక్ట్ కాదని ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు ..