`అపరిచితుడు`కు అన్నీ అపజయాలే…
`అపరిచితుడు`కు అన్నీ అపజయాలే…
శివపుత్రుడు సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విక్రమ్ ఇపుడు హిట్ మాట మరిచిపోయాడు.. శివపుత్రుడు, అపరిచితుడు సినిమాలతో రజనీకాంత్, కమల్ హాసన్ ల మాదిరి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ నటుడిగా పేరు పొందాడు.. అయితే గత 15 సంవత్సరాలుగా విక్రమ్‌కు హిట్ లేక పోవడంతో తెలుగులో బిజినెస్ బాగా పడిపోయింది.. ఈ మధ్య విడుదల అయిన మిస్టర్ కెకె సినిమా కూడా బాగా నిరుత్సాహ పరచడంతో బయ్యర్లు పెదవి విరుస్తున్నారు.. ఇంక తెలుగులో విక్రమ్ మార్కట్ కోల్పోయినట్టే అని భావిస్తున్నారు.. విక్రమ్ తన కొడుకును హీరోగా సినిమా చేసే పనిలో నిమగ్నమైపోయి తన సినిమా కథల విషయంలో సరైన జడ్జిమెంటు చేయడంలేదనే విమర్శలు కూడా ఉన్నాయి..
దక్షిణాదిన కమల్ హాసన్ మాదిరిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో విక్రమ్ ముందు వరుసలో ఉంటాడు.. శంకర్ అపరిచితుడు తరువాత `ఐ` సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు.. అయినప్పటికీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.. దీంతో విక్రమ్ తెలుగు , తమిళ రంగాలలో హిట్ లేక, మార్కెట్ లేక అయోమయంలో పడ్డాడు..