ఇదే నా మొదటి ప్రేమ లేఖ …
ఇదే నా మొదటి ప్రేమ లేఖ …
జనసేనాని జగన్ కు లేఖ రాసారు .. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసాక పవన్ సంధించిన మొదటి లేఖ ఇదే ..
ప్రభుత్వానికి 100 రోజులు టైమిద్దామనుకున్నా కానీ ప్రభుత్వ ఇసుక విధానం వల్ల రాయక తప్పడం లేదన్నారు .. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రాస్తున్నట్టు ప్రకటించారు .. కార్మికుల పక్షాన జన సేన ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు .. ఇసుక విధానంపై ప్రభుత్వం సెప్టెంబర్ 5 న నిర్ణయం ప్రకటిస్తే అప్పటివరకూ కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ …
ఇదిలా ఉండగా టైం తక్కువగా ఉండడం వల్లనే తాను ఓడిపోయానని అభిప్రాయపడ్డారు .. తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోవాలంటే ఎవరు అడ్డు చెప్తారు.. ఒంటరిగా పోటీ చేయాలనుకున్నాం చేసాం ..అంతేనన్నారు ..
జనసేన పార్టీ ఆవిర్భావ లక్ష్యమే ప్రశ్నించడం ..అధికారపార్టీ లోపాలను ఎత్తిచూపి ప్రశ్నించడమే భాద్యతగా స్వీకరించిన జనసేనాని.. ప్రశ్నించడం మొదలుపెట్టడం తో జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చినట్లయింది .