కాజల్ కెరీర్ ఎటు పోతుంది
కాజల్ కెరీర్ ఎటు పోతుంది
13 సంవత్సరాల క్రితం లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తొలి హిట్ అందుకుంది కాజల్. మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాతో కాజల్ కు స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు వచ్చాయి. డార్లింగ్, బృందావనం, మిస్టర్ ఫర్పెక్ట్, బిజినెస్ మేన్ సినిమాలు కాజల్ కు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు ఫ్లాప్ కావటంతో కాజల్ కు అవకాశాలు తగ్గాయి. ఇక టాలీవుడ్లో కాజల్ కెరీర్ ముగిసినట్లే అని వార్తలు వస్తున్న సమయంలో ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది కాజల్. కాజల్ హీరోయిన్ గా నటించిన రణ రంగం సినిమా ఆగష్ట్ 15వ తేదీన విడుదలైంది. రణరంగం సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ ఇద్దరూ నటించటంతో మెయిన్ హీరోయిన్ గా కాజల్, సెకండ్ హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోందని అందరూ భావించారు.
కానీ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కు ఉన్నంత ప్రాముఖ్యత కాజల్ కు లేదు. రణరంగం సినిమా విడుదలకు ముందు కథను మలుపు తిప్పే పాత్ర అని కాజల్ చెప్పినప్పటికీ సినిమా చూసాక ఇలాంటి పాత్రలో కాజల్ ఎందుకు నటించిందా అనే సందేహాలు వస్తాయి. ఇదే ప్రశ్న మీడియా శర్వానంద్ ను అడిగితే కాజల్ తో చాలా సన్నివేశాలే చిత్రీకరించామని కానీ నిడివి సమస్య వలన కాజల్ తో తీసిన సన్నివేశాలు తొలగించామని చెప్పాడు.
రణరంగం సినిమాకు ప్రేక్షకుల నుండి అబవ్ యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా వలన కాజల్ కెరీర్ కు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. ప్రస్తుతం కాజల్ మంచు విష్ణుతో ఒక సినిమాలో, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్టైతే ఏ సమస్య లేదు కానీ ఈ సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసినట్లే.