దీపం వివాదంలో ఓవర్ డైలాగులు

దీపం వివాదంలో ఓవర్ డైలాగులు
జగన్ అమెరికా ఢల్లాస్ టూర్ గురించి నిన్న ఒక ఈమెయిల్ పోస్ట్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒక అంశాన్ని ప్రస్థావించారు. ఇటు బిజెపికాని, అటు తెలుగుదేశం కాని ప్రస్థావించిందేమిటంటే అక్కడ దీపం పెట్టబోతుంటే ఆయన దాన్ని వెలిగించనన్నారన్న అంశం. దానికి వీరు ఇచ్చిన వివరణ మంచి వివరణ అనే చెప్పాలి. సదుద్దేశంతోనే ప్రచారప కండూతి జగన్కు లేదు. వాస్తవానికి అక్కడ దీపం వెలిగించడానికి అక్కడ చట్టప్రకారం నిప్పు పెట్టకూడదు. దాంతో ఒక ఎలక్ట్రిక్ ల్యాంప్ని పెట్టగా. సరే దాన్ని ఒక చిన్న అగ్గిపుల్లతో వెలిగించమన్నారు. దానికి కూడా జగన్ ససేమిరా అన్నారు. చంద్రబాబు లాగా మనకు ప్రచారం అవసరం లేదు అని జగన్ దానికి కూడా అంగీకరించలేదు అన్నది మంచి విషయమే. కాని ఆ నిర్వాహకుల బుర్ర ఎక్కడకి పోయింది. ఓన్లీ ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పిలుచుకోవడం అందులోనూ సీనియర్లను పక్కన పెట్టడం ఇటు వంటి పరువు తక్కువ వ్యవహారాలు అన్నీ అక్కడ జరగసాగాయి. అంటే ఆ దీపం దగ్గరకి తీసుకువెళ్ళకపోతే నష్టం ఏమన్నా ఉందా. అసలు ఆ దీపం అక్కడ లేకపోతే వచ్చిన నష్టమూలేదు. మేం ఒక సాంప్రదాయబద్ధంగా చేశామని ఒక ఫొటో పెడితే చాలు మంచిది. అంతటితో ఆగితే అయిపోయేది అంతేగాని ఈ దొంగనాటకాలన్నీ ఎందుకు ఆడించాలి. పోనీ ఆయన స్టేజ్ మీద నుంచి స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలిగేలా చేసినా బావుండేది. కానీ వీళ్ళ వైఖరి ఎలా ఉందంటే…. పూర్వం ఒక సామెత ఉండేది మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అని ఆర్గనైజర్స్ ఎక్కువయితే లోపాలు ఎక్కువ కనపడతాయి అన్న దోరణిలో… అందరూ చదువుకున్నవారే ప్రతి విషయం పై అవగాహన ఉన్నవారే. మరి వీరే ఒకప్పుడు ఎదుటివారిని విమర్శించారు కదా చంద్రబాబు ఫొటోల కోసం ఇలాంటివి అన్నీ చేశారని. మరి ఇప్పుడు మీరు చేసిందేమిటి. అంటే ఏదైనా ఎవరిదగ్గరకి వస్తేనేగాని వాళ్ళకి తెలియదా.
పోనీ ఆ అంశాన్ని అక్కడితో ఆపేయకుండా ఈ యొక్క సమస్యని తెరలేపిన వారిని దుర్భాషలాడటం. బుర్ర ఎక్కడికి పోయింది. కళ్ళు ఎక్కడికి పోయాయి. మా నాయకుడు గొప్పదేవుడు అంటూ మొదలెట్టారు. ఆ నాయకుడు గొప్పోడే కాకపోతే వీళ్ళ తెలివితక్కువ అసమర్ధత వల్ల ఆ నాయకుడి పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు మతముద్రణ ఒకటి తీసుకొచ్చిపెట్టింది ఎవరు మీరు చేసిన తెలివి తక్కువ పని వల్లే కదా ఇలాంటి విషయం ఒకటి తెరపైకి వచ్చింది. రాజకియాల్లో అధికారంలోకి రావడం వేరు. ఒకసారి అధికారం వచ్చాక సంస్కారయుతంగా బాధ్యతాయుతం, అహంకారానికి దరంగా, నిజాయితీకి నిలువెత్తుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ ఆ ప్రతయ్నం చేస్తుంటే దాన్ని చెడగొట్టడం కోసం ఆయన చుట్టూ కొంత మంది ఉన్నారు.
ఇక జగన్ గురించి తీసుకుంటే ఆయన ప్రవర్తన అంతవిచ్చలవిడిగా అయితే లేదు. ఆయన వ్యవహారశైలి మొత్తం చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాని ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ తప్పులు వల్ల చివరికి తను దోషి అవ్వవలసి వస్తుంది. ఆయన బాగు కోరి వెంట వెళ్లినవారు ఆయనకు ఎంత వరకు ఉపయోగపడ్డారో తెలియదు కాని. ఆయన నాశనానికి మాత్రం ఉపయోగపడ్డారు. అనవసరమైన డైలాగులు, అనవసరమైనటువంటి సెటైర్లు అసలు తిట్టడమెందుకు అయ్యా అసలు ఉద్దేశ్యం ఇది ఆయన ఇలా అనుకున్నారు. మేం ఇలా చేశాం అని మర్యాదపూర్వకంగా కూడా చెప్పొచ్చు. అసలు తప్పు చేసింది మీరైతే దాని మీద వచ్చిన స్టేట్మెంట్ని ఇచ్చిన వారిని తిట్టడం సబబు కాదుకదా. సమాధానం నిధానంగా కూడా చెప్పొచ్చు. మా ఉద్దేశ్యం ఇది ఆయన బాధ్యతగానే ఉన్నారు మేమే పొరపాటు చేశాం. మా పొరపాటును కూడా ఆయన సరిద్దాలనుకున్నారు అని ఎంతో మర్యాదపూర్వకంగా కూడా చెప్పొచ్చు. దానికి ఎదురు దాడి చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ మనం కూడా చదువుకున్నాం కదా. దీన్ని బట్టి ఎవరైనా సంస్కారంతో నడుచుకుంటే బావుంటుందనే ఉద్దేశ్యం వ్యక్తమవుతుంది.