నవంబర్ నుంచి బన్నీ – బోయపాటి చిత్రం?
నవంబర్ నుంచి బన్నీ – బోయపాటి చిత్రం?
అల్లు అర్జున్ కెరీర్లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాలలో `సరైనోడు` ఒకటి. ఈ సినిమాతో మాస్లో బన్నీ రేంజ్ అమాంతం పెరిగింది. అలాంటి `సరైనోడు` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన బోయపాటి శ్రీను కాంబినేషన్లో బన్నీ మరో సినిమా చేయబోతున్నాడని సమాచారం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమా… నవంబర్ నుంచి పట్టాలెక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని… త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం బన్నీ… త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.