“నిన్ను తలచి” సెప్టెంబర్ లో రిలీజ్
సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ “నిన్ను తలచి”
ఎస్ ఎల్ యెన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి, ఓ క్యూట్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమా తో వంశి యాకసిరి, స్టెఫీ పటేల్ హీరో హీరోయిన్లుగా పరచియం అవుతున్నారు, స్వతంత్ర దినోత్సవం అలానే రక్షాబంధన్ సందర్బంగా ఈ సినిమా కి సంబందించిన లేటెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ lo. రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గా నిర్మాతలు తెలిపారు.
నిర్మాత అజిత్ కుమార్ మాట్లాడుతూ, ఒక హానెస్ట్ అట్టెంప్ట్ చేసాము, ఈ సినిమాను కేవలం ఒక ప్రేమ కథ లా కాకుండా అటు ఫ్యామిలీ ఇటు యూత్ ని ఆకట్టుకునేలా రెడీ చేయడం జరిగింది. మా సినిమాకు మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందని నేను బలం గా నమ్మతున్నా, త్వరలోనే మా సినిమా లో ఉన్న వీడియో సాంగ్స్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము, వంశి, స్టెఫీ పటేల్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నం అన్నారు.
దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ, అనుకున్న బడ్జెట్, అనుకున్న టైం లో ఈ సినిమాను పూర్తి చేయగలిగాము, నా కథ ని నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చి, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇస్తున్న వంశి, అసలు కొత్త వాడిలా అనిపించడు, ఈ సినిమాకి వంశి నటన కచ్చితంగా ప్లస్ అవుతుంది అని నేను నమ్మతున్నా. అలానే స్టెఫీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాం, త్వరలోనే వీడియో సాంగ్స్ , ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.
హీరో వంశి మాట్లాడుతూ ఓ ఫీల్ గుడ్ మూవీ తో నేను టాలీవుడ్ కి పరిచయం అవ్వడం చాలా ఆనందం గా ఉంది, మా డైరెక్టర్ అనిల్ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రెడీ చేశారు. అలానే ఎక్కడ లోటు కాకుండ నిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబర్ రిలీజ్ కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్న, మా నిన్ను తలచి టీం ని ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
క్యాస్ట్ & క్రూ
వంశీ యాకసిరి
స్టెఫీ పటేల్
జబర్దస్త్ మహేష్
కేధార్ శంకర్
తదితరులు
నిర్మాతలు : ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్
కథ, దర్సకత్వం : అనిల్ తోట
మ్యూజిక్ : మహావీర
సినిమాటోగ్రఫీ : శ్యాం ప్రసాద్
ఎడిటింగ్ : సాయి బాబు తలారి
పబ్లిసిటీ డిజైన్స్ : ఓంకార్ కడియం