పూరి..ఛార్మి..ఓ ఇస్మార్ట్ శంకర్…
సక్సస్లకు చిరునామా..హిట్లకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పూరి జగన్నాథ్ ఇపుడు ఒకే ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు.. అది 2015 పూరి జగన్ హిట్ ఇచ్చిన చిత్రం టెంపర్ రిలీజు అయిన సంవత్సరం… నాటి నుండి వరకూ జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా లాంటి డబల్ హ్యాట్రిక్ ప్లాపులతో ప్రేక్షకుల సహనాన్ని సాధ్యమైనంతవరకూ పరీక్షించాడు పూరి…తెలుగునాట అగ్రదర్శకులలో ఒకడిగా ఉన్న పూరి..టాప్ హీరోలు పవన్, మహేష్, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున అందరికీ హిట్ లు ఇచ్చిన పూరి.. తక్కువ కాలంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించి నేటి దర్శకులలో మేటి అనిపించుకున్న పూరి.. తెలుగు సినిమా చరిత్రలో రికార్డుల మోత మోగించిన పూరి.. ఇపుడు హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు.. సొంత బ్యానర్లో ఛార్మి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు… రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పైనే పూరి ఆశలు పెట్టుకున్నాడు.. ఈ నెలలో రిలీజు కాబోతున్న ఈసినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది… wish you all the best puri jagannadh…..