ప్రేమించడం ఇష్టం…
ప్రేమించడం ఇష్టం…
అర్జున్ రెడ్డి కి రీమేక్ హిందీలో కబీర్ సింగ్ భారీ విజయాన్ని నమోదు చేసింది.. అందరి అంచనాలు తారుమారు చేసింది.. సోషన్ మీడియా ఇచ్చిన రేటింగ్ కూడా అధిగమించి ఊహలకందని విజయం సాధించింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.. ఈ భామ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలలో నటించి తెలుగు వారికి సుపరిచితురాలయింది…ఇదంతా పక్కన పెడితే కబీర్ సింగ్ ( అర్జున్ రెడ్డి) సినిమా ప్రభావమో ఏమో కానీ ఎప్పటికైనా ప్రేమ వివాహం చేసుకుంటానని ఒక స్టేట్ మెంటు ఇచ్చేసింది.. కియారా కు ప్రేమ కాన్సెప్ట్ బాగా నచ్చుతుందట.. అమ్మా నాన్నలది కూడా ప్రేమ వివాహమే అని చెప్పింది… ఈమె ప్రేమించడానికి కొన్ని కండిషన్లు పెట్టింది.. జీవితమంతా ఇతనితోనే జీవించాలనే ఫీలింగ్ కలిగే అబ్బాయి కనిపించాలట..నిజాయితీ పరుడై ఉండాలట..హార్డ్‌వర్క్ చేసే వాడై ఉండాలట.. ఇవన్నీ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు అంటూ తెలియజేసింది… అటువంటి వారు ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు….
ఇక మరి ఈ ప్రభావం అంతా కేవలం అర్జున్‌రెడ్డి చిత్రంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిందా ఏంటి… తను పెట్టిన కండీషన్స్ అన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వివాదాల మద్య కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. కబీర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. ఈ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా.. ఈ వివాదాల గురించి.. సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వస్తున్న లవ్ ఎఫైర్ గురించి స్పందించారు. కచ్చితంగా నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’ అని స్పష్టం చేసింది.