ప్రేమమ్` బాటలోనే `వెంకీమామ`

నిజజీవితంలో మేనమామ మేనల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ నాగచైతన్య.. తెరజీవితంలోనూ అవే పాత్రల్లో కనిపించనున్న చిత్రం `వెంకీమామ`. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాని విజయదశమి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `ప్రేమమ్`(2016) చిత్రంలోనూ వెంకీ మేనమామగా అతిథి పాత్రలో మెరిసాడు. ఆ సినిమా కూడా దసరాకే రిలీజై మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో… మేనమామ మేనల్లుళ్ళుగా పూర్తిస్థాయిలో నటిస్తున్న ఈ సినిమా కూడా అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి. కాగా.. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ ఆఫీసర్‌గా చైతూ నటిస్తున్న `వెంకీమామ`కి కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.