ప్రపంచవ్యాప్తంగా అగష్టు 9న “నివాసి” విడుదల
ప్రపంచవ్యాప్తంగా అగష్టు 9న “నివాసి” విడుదల
శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంతో ఇటీవల ఎమజాన్ ప్రైమ్ లో 1 మిలియన్ కి పైగా వ్యూస్ తో 8.4 రేటింగ్ తో ప్రేక్షకుల ప్రశంశలు అందుకుంటున్న శేఖర్ వర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్‌గా , సతీష్ రేగళ్ళ ని దర్శకుడు గా పరిచయం చేస్తూ గాయత్రి ప్రోడక్షన్స్ బ్యానర్స్ లో కె.ఎన్.రావు నిర్మాతగా నిర్మిస్తున్న నివాసి చిత్రాన్ని. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అగష్టు 9న విడుదల చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి. చరణ్-అర్జున్ సంగీత దర్శకులు.
హీరో శేఖర్ వర్మ మాట్లాడుతూ.. ఇటీవల శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట అనే చిత్రం ఎమాజాన్ ప్రైమ్ లో చూసిని ప్రేక్షకులు నుంచి వస్తున్న ప్రశంశలు నాలో వున్న ఉత్సాహన్ని రెట్టింపు చేసాయి. ఆ ఆనందంలో చేసిన నివాసి చిత్ర నా కెరీర్ లో మరో మంచి చిత్రం గా నిలుస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం తో నేను అందరికి రీచ్ అవుతానని నమ్ముతున్నాను. ఒక మంచి ట్రావల్ స్టోరి, దర్శకుడు సతీష్ చాలా కష్టపడి అంతకి మించి ఇష్టపడి చేశాడు. ప్రతి మనిషి ఒకసారి ఆలోచించుకునేలా ఈ చిత్ర కథ వుంటుంది. తప్పకుండా అందర్నిఆకట్టకుంటుంది. అని అన్నారు
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ రేగళ్ళ మాట్లాడుతూ.. ఇటీవల ఎమాజాన్ ప్రైమ్ లో శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమా లో శేఖర్ వర్మ చాలా చక్కగా నటించి మెప్పించాడు. దానికి వస్తున్న ఎప్లాజ్ చూస్తున్నారు. మా నివాసి చిత్రం దాన్ని మించిన ఎమెషన్ తో ప్రతి ఓక్కరి మనసు గెలుచుకునేలా వుంటుంది. మా నివాసి లో హీరో శేఖర్ లోని ఇంకో యాంగిల్ ని చూపింస్తున్నాము. ఈ చిత్రం తరువాత శేఖర్ చాలా మంచి నటుడుగానే కాకుండా సక్సస్ఫుల్ హీరోగా నిలబడతాడు. అలాగే నిర్మాతలు కె.ఎన్.రావు గారు, వర్మ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ చిత్రాన్ని అగష్టు 9న విడుదల చేస్తున్నాము. అని అన్నారు
బ్యానర్స్… గాయత్రి ప్రోడక్షన్స్
నటీనటులు.. శేఖర్ వర్మ, వివియా, విద్య, సుదర్శన్, జె.పి(తమిళ్), కొటేశ్వరావు తదతరులు నటించగా..
కొరియోగ్రఫి– భాను మాస్టర్, ప్రసాద్ మాస్టర్
మ్యూజిక్- చరణ్-అర్జున్
సినిమాటోగ్రఫి– కె.చిట్టిబాబు
ఆర్ట్– మురళి వీరవల్లి
పి.ఆర్.ఓ– ఏలూరు శ్రీను
ఎడిటింగ్– ప్రతాప్
స్టంట్స్– షయెలిల్ మల్లేష్
నిర్మాతలు– కె.ఎన్.రావు,
దర్శకత్వం– సతీష్ రేగళ్ళ