బాలనటుడిగా 11 ఏళ్ళు హీరో గ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నసూపర్ స్టార్
బాలనటుడిగా 11 ఏళ్ళు
హీరో గ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నసూపర్ స్టార్
సినిమా చరిత్రలో అరుదైన రికార్డులు మహేష్ బాబు సొంతం .. మహేష్ బాబు సాధించిన రికార్డులు మరో హీరో తెలుగులో కానీ దక్షిణాది భాషల్లో కానీ, ఆ మాట కొస్తే దేశంలోనే మహేష్ రికార్డులు మహేష్ కే సాధ్యం .. ఒక సూపర్ స్టార్ కొడుకు మరో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకోవడం గొప్ప కాకపోయినా , తన కృషితో, పట్టుదలతో ఇన్నేళ్లు సూపర్ స్టార్ గా నిలదొక్కుకోవడం నిజంగా మహేష్ గొప్పతనమే . బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమాలు , ప్రేక్షకుల మన్ననలు పొందే సినిమాలు , కలక్షన్ల వర్షం కురిపించే సినిమాలు , ఎన్నో అవార్డులు పొందిన సినిమాలు మహేష్ బాబు హీరో గా ఈ ఇరవై ఏళ్ల సినీ జీవితం లో అనేకం.
1975 లో పుట్టిన మహేష్ బాబు 1979 లోనే బాల నటుడిగా ` నీడ ` సినిమాలో అరంగేట్రం చేసాడు . మొదటి సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడం తో మహేష్ ప్రధాన భూమికగా అనేక సినిమాలు వచ్చాయి . 1979 నుండి 1990 వరకూ బాలనటుడిగా 11 ఏళ్ళు చేసిన మీదట ` బాల చంద్రుడు ` సినిమా మహేష్ బాబు ఆఖరి సినిమా .. తొమ్మిదేళ్ల తరువాత 1999 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ` రాజకుమారుడు ` మహేష్ బాబు నటించడం తో హీరో గా రీ ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది ..
వరుస మూడు సినిమాలు ప్లాప్ లు రాజకుమారుడు,యువరాజు , వంశి ఆ తరువాత .. 2001 లో కృష్ణ వంశి దర్శకత్వంలో రిలీజ్ అయిన ` మురారి ` సినిమా మహేష్ బాబు హీరో గా మొదటి హిట్ .. తదుపరి వచ్చిన రెండు సినిమాలు టక్కరి దొంగ , బాబి సినిమాలు అట్టర్ ప్లాప్ ల అనంతరం 2003 లో రిలీజ్ అయినా ` ఒక్కడు` సినిమా మహేష్ కు రెండో హిట్ వచ్చింది .. ఒక్కడు సినిమా హిట్ ఆనందంలో ఉండగానే నిజం, నాని , అర్జున్ సినిమాలు మహేష్ బాబు ను నిరుత్సాహం లో పడేశాయి .. కానీ 2005 లో వచ్చిన అతడు సినిమా కు మహేష్ బాబు కు నటన పరంగా ప్రశంసలు వచ్చినప్పటికీ నిర్మాత కు మాత్రం లాభాలు చేకూర్చలేక పోయింది … 2006 లో పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చిన ` పోకిరి` సినిమా అప్పటి వరకూ తెలుగు సినిమా లో నమోదు చేసుకున్న అన్ని రికార్డు లను అధిగమించింది .. మహేష్ ను సూపర్ స్టార్ గా నిలబెట్టింది ..
మరో సారి మూడు సినిమాలు నాలుగేళ్లు మహేష్ బాబు గ్రహణ కాలం.. వరసగా సైనికుడు , అతిధి , ఖలేజా డిసాస్టర్ లుగా నిలిచాయి.. 2011 లో వచ్చిన ` దూకుడు` సినిమా అన్ని రికార్డులు మరల తిరగరాసింది. దీంతో మహేష్ కెరీర్ లో మొదటిసారి హ్యాట్రిక్ కొట్టాడు దూకుడు , బిసినెస్ మెన్ , సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు .. మూడేళ్లు దిగ్విజయంగా జరిగిన యాత్ర మరల 2014 లో వచ్చిన రెండు సినిమాలు ` వన్ నేనొక్కడినే `, `ఆగడు ` సినిమాలు ప్లాపులు అవ్వడంతో మహేష్ బాబు కు 2015 ` శ్రీమంతుడు ` మరల సూపర్ డూపర్ హిట్ వచ్చింది … 2016, 2107 లో రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం ,స్పైడర్ సినిమాలు మహేష్ కెరీర్ లోనే పెద్ద డిసాస్టర్ లుగా వచ్చాయి .. 2019 ` మహర్షి` సినిమా మహేష్ బాబు కు హీరో గ 25 వ సినిమా గా వచ్చింది .. విజయం సాధించింది ..
హిట్ తరువాత మహేష్ కు వరసగా రెండు గాని , మూడు గాని ప్లాప్ రావడం ఆనవాయితీగా గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతూ వచ్చాయి .. అయినప్పటికి మహేష్ సినిమా ఎప్పుడు ఎన్ని ప్లాప్ లు తరువాత వచ్చిన కూడా బిజినెస్ కు కానీ,కలెక్షన్లకు కానీ తిరుగులేని గ్లామర్ సంపాదించడం ఒక విశేషమే …
మహేష్ కు మాత్రమే సొంత మైన కొన్ని అరుదైన రికార్డులు …
మహేష్ బాబు కు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డులు అనేకం ఉన్నాయి . హిట్ లు వచ్చినా మరో హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మహేష్ గొప్పతనం .. ఉదాహరణకు సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు .. 20 ఏళ్ల కెరీర్ లో 25 సినిమాలు .. ఎనిమిది అత్యంత ప్రతిష్టాకరమైన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు.. ఫిలిం ఫేర్ అవార్డులు, సైమా అవార్డులు, ఐఫా అవార్డులు , సంతోషం అవార్డులు , సినీ గోయెర్ అవార్డ్స్ లాంటివి ముప్పై కి పైగా రావడం తో పాటు .. ` ఒక్కడు , పోకిరి , అతిధి , దూకుడు , శ్రీమంతుడు ` సినిమాలకు ఒక్కో సినిమాకు నాలుగేసి అవార్డులు పైగా రావడం మహేష్ బాబు కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవాలు ..
తండ్రికి తగ్గ కొడుకుగా సినిమా చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలగాలని ఆశిస్తూ , ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూన్నది ..