యాష్ తో రెఢీ …

యాష్ తో రెఢీ …
`జనగణమన ` అనగానే ప్రతి భారతీయుడి గుండెలోతుల్లో ఏదో తెలియని దేశభక్తి గోచరిస్తుంది .. ఒక్కసారి భరతమాత గుర్తుకు వస్తుంది .. అటువంటి టైటిల్ తో పూరి జగన్నాధ్ గత మూడేళ్ళుగా ఊరిస్తున్నాడు .. మహేష్ తో చేద్దామని అంతా సిద్ధం చేసుకున్న తరుణం లో మహేష్ నో చెప్పడం తో పూరి హర్ట్ అయ్యాడు .. కసి పెరిగింది .. ఇస్మార్ట్ శంకర్ ను భారీ హిట్ చేసాడు .. ఈ హిట్ వెనుక పూరికి జరిగిన అవమానాలు ఉన్నాయి .. ముందు వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి .. లేదంటే రోగ్, లోఫర్ , మహమూద్ లాంటి సినిమాలు తీసేవాడేగా ..
సరే అసలు విషయానికి వస్తే జనగణమన కథను కన్నడ హీరో యాష్ కు వినిపించాడట .. యాష్ కేజీఎఫ్ తో తెలుగు వారికి కూడా సుపరిచితుడే .. కథ విన్న యాష్ చిన్న చిన్న మార్పులు చెప్పాడట .. యాష్ సంతృప్తి చెందిన తరువాత అధికారికంగా అనౌన్సుమెంట్ రావచ్చు .. ఈలోపు కేజీఎఫ్ 2 కూడా రిలీజ్ అవుతుంది .. అపుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో క్రేజ్ రెట్టింపు అవుతుంది .. ఏది ఏమైనప్పటికీ పూరి బ్రెయిన్ బాగానే పని చేస్తుంది .. లేకుంటే హిట్ వచ్చింది కాబట్టి తమ్ముడితోనో , కొడుకుతోనో సినిమా చేయకుండా ఒక మాస్ హీరో ను ఎంచుకున్నాడు .. హిట్ గ్యారంటీ …