యూట్యూబ్‌లో ‘ఎఫ్ 2’ సెన్సేషన్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం ‘ఎఫ్ 2’. 2019 సంక్రాంతి విజేతగా నిలచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా భార్యా బాధితులుగా వెంకటేష్, వరుణ్ నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించగా… ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించారు.
ఇదిలా ఉంటే… ఈ సినిమా బాక్సాఫీస్ వద్దే కాదు… ఇప్పుడు యూ ట్యూబ్‌లోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవల (జులై 14న) ఆదిత్యా మ్యూజిక్ సంస్థ `ఎఫ్ 2` మూవీ హిందీ వెర్షన్‌ని యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేయగా… కేవలం 5 రోజుల్లోనే 23 మిలియన్ల మంది ఈ సినిమాని వీక్షించారు. మొత్తమ్మీద… మన భార్యాబాధితుల కథ తెలుగువారినే కాదు హిందీవారిని కూడా అమితంగా ఆకర్షిస్తోందన్నమాట. మున్ముందు… ఈ సినిమా ఖాతాలో ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి మరి.