లాంఛనంగా ప్రారంభమైన `ఒకడు`
లాంఛనంగా ప్రారంభమైన `ఒకడు`
లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్ ఇవ్వగా.. సత్య మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్‌ను బి.వి.ఎస్.రవి అందించారు. ఈ సందర్బంగా…
దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం. మంచి అనుభవమున్న టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రియల్ ఇన్సిడెంట్‌తో థ్రిల్లర్ సబ్జెక్ట్‌గా రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 15 లేదా 16 తేదీ నుంచి మొదలవుతుంది. 5 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్
సిటీ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగనుంది“ అన్నారు.
నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ “కొత్త కథనంతో అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాం. ఈ `ఒకడు` సినిమాను ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను“ అని అన్నారు.
హీరో అఖిల్ రెడ్డి మాట్లాడుతూ “నేను నటిస్తున్న తొలి చిత్రమిది. మంచి స్క్రిప్ట్‌తో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ సినిమాలోని ప్రతి సీన్
ప్రతి క్షణం ప్రేక్షకులకు టెన్షన్ క్రియేట్ చేసేలా ఉంటుంది. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను“ అన్నారు.
హీరోయిన్ దీపికా వడ్డాని మాట్లాడుతూ “గుడ్ స్క్రిప్ట్‌లో బాగమైనందుకు ఆనందంగా ఉంది. తప్పక సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను“ అన్నారు.
హీరోయిన్ దీపాలి శర్మ మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. థ్రిల్లర్ ఎలిమెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
అఖిల్ రెడ్డి, దీపికా వడ్డాని, దీపాలి శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతలు: సండ ముత్తయ్య, సోమరాజు కల్యాణి, లైన్ ప్రొడ్యూసర్: వి.పద్మనాభం, మ్యూజిక్:మణిశర్మ, డిఓపి: ఎస్. మురళి మోహన్ రెడ్డి, డైలాగ్స్: పవన్ అత్సాల, లిరిక్స్: శ్రీమణి, ఎడిటర్:ఎస్ ఆర్. శేఖర్, స్టంట్స్: సుబ్బు, ఆర్ట్: పి ఎస్. వర్మ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బు, కో డైరెక్టర్స్: జె.వి. కృష్ణ రెడ్డి, శరత్ కుమార్. స్టోరీ- స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కృష్ణ చైతన్య.