వాల్మీకి` టైటిల్ వివాదం…
వాల్మీకి` టైటిల్ వివాదం…
వాల్మీకి సినిమా టైటిల్ను మార్చాలని కోరుతూ బోయ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకి బోయలు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.. ఈ నేపథ్యంలోనే …బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలని, లేదంటే బీసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
ఓ గ్యాంగ్ స్టర్ సినిమాకు మహర్షి అయిన వాల్మీకి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. వాల్మీకి అంటే భారతీయ సంస్కృతికి చిహ్నమని, డబ్బులు సంపాదించడం కోసం ఆయన పేరును పెట్టడం మంచిది కాదన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేదిగా సినిమా ఉండాలే తప్ప సమాజాన్ని భ్రష్టుపట్టించేదిగా ఉండరాదన్నారు. ఈ సినిమా టైటిట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
టైటిల్ వివాదాలు సినిమాలకు కొత్తేమీ కాదు.. గతంలో పవన్ కల్యాణ్ కొమరం భీం సినిమాకు విమర్శలు వచ్చాయి… కానీ ఇపుడు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాల అధ్యక్షుని జోక్యంతో వాల్మీకి సినిమాకు టైటిల్ కష్టాలు తప్పవని సినీ విశ్లేషకుల అభిప్రాయం…