శ్రీ జైపాల్ రెడ్డి గారి పార్థివశరీరానికి శ్రీ జి. కిషన్ రెడ్డి నివాళులర్పించారు
శ్రీ జైపాల్ రెడ్డి గారి పార్థివశరీరానికి శ్రీ జి. కిషన్ రెడ్డి నివాళులర్పించారు
శ్రీ జైపాల్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి వారి పార్థివశరీరానికి (భౌతిక కాయానికి) కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా శ్రీ జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెళ్లి నివాళులర్పించారు. శ్రీ జైపాల్ రెడ్డి గారు ప్రజల తరఫున తన వాణిని వినిపించి సమస్యలు పరిష్కరించే వారు. దేశ అభివృద్ధి కోసం వారు చేసిన సేవలు అపూర్వం . ఈ కష్ట సమయంలో శ్రీ జైపాల్ రెడ్డి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఒక గొప్ప పార్లమెంటేరియన్ కోల్పోయాం. రాష్ట్ర కేంద్ర రాజకీయాలలో శ్రీ జైపాల్ రెడ్డి గారి సుస్థిర స్థానం. విద్యార్థి నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లో చేరి ఉన్నత స్థానానికి చేరిన వ్యక్తి.
శ్రీ సూదిని జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతిని కలిగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం