సాహోకి సీక్వెల్ ఉందంటున్న ప్రభాస్
సాహోకి సీక్వెల్ ఉందంటున్న ప్రభాస్
‘సాహో’ చిత్రం తర్వాత తాను అద్భుతమైన లవ్‌స్టోరీ సినిమా చేయనున్నట్టు ప్రముఖ నటుడు ప్రభాస్ వెల్లడించారు. ‘సాహో’ సినిమా కూడా పరిపూర్ణ సాహసభరిత దృశ్యాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో సాహో సినిమా ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘సాహో’ భారీ బడ్జెట్ చిత్రమని, రూ.350 కోట్ల దాకా ఖర్చు పెట్టారని చెప్పారు.
ట్రైలర్లో భవిష్యత్ సినిమా అప్రోచ్ ‘మిషన్ ఇంపాజిబుల్’లా కన్పించింది. ఫ్యూచర్ వరల్డ్‌లా సినిమా వుంది. ఇలాంటి కథను మన ఆడియన్స్‌కు ఎలా రిసీవ్ అవుతుంది?
ఇది ప్రజెంట్ ఫిలిం. జెట్ఐ వుంటుంది. ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ వుండదు. కమర్షియల్ సినిమా కాబట్టి లార్జర్‌దాన్ హైలేలో వుంటుంది. మొదటి భాగం ముంబైలో వుంటుంది. దుస్తులు, గన్స్ కూడా ఫ్యూచరిస్ట్‌గా వుండదు. ఎయిర్‌లో ఫైట్ కోసం జెట్‌ను యూజ్ చేశాం. ఇది కేవలం విజువల్ ఇంపాక్ట్ కోసమే. యాక్షన్‌లో ఆఫ్టర్ ‘బాహుబలి’ తర్వాత కొత్తగా చేయాలని జెట్ ఐకాన్‌తో చేశాం. అలాగే వాటర్ పాల్స్కూడా మంచి ఫీలింగ్ వస్తాయి.
సుజిత్ నిక్కర్ వేసుకుని కథ చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు?
సుజిత్ ఎప్పటినుంచో తెలుసు రన్‌రాజా రన్ చిత్రం అప్పటి నుంచి తెలుసు. యు.వి. క్రియేషన్స్ ఇంట్రడ్యూస్ చేసింది. కథ చెపుతాను అన్నాడు. నాకు సుజిత్ అంటే మంచి అభిప్రాయం ఉంది కానీ కథ చెపుతాడు అనుకోలేదు. రన్‌రాజారన్ చేస్తన్నప్పుడు నా తర్వాత చిత్రానికి పని చేస్తావా అని అడిగాను. కానీ కాదు నేను మీకోసం కథ తీసుకువస్తాను అన్నాడు. అబ్బా ఏం కాన్ఫిడెన్స్ తీసుకురా చూద్దాం అన్నాను. తన కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది.
ఈ కథకి మీరేమన్నా రిఫరెన్స్ ఇచ్చారా?
నేను కథ గురించి డిస్కస్ చేశాను. సుజిత్ బాగా న్యారేట్ చేశాడు. ఎక్కువగా ఎంటర్టైనింగ్ సైడ్ ప్లాన్ చేశాం. వర్క్ షాప్ అదీ చేశాం. తనకు అనిపించింది తను చెప్పాడు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఇందులో ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. మీరు ట్రైలర్లో కూడా చూస్తారు. వైలెన్స్, రొమాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ అన్నీ బావుంటాయి.
ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి ?బాహుబలికి ఈ చిత్రానికి మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏంటి?
కొత్తగా నేర్చుకున్నది అంటే అది ఒక పీరియాడిక్ సినిమా. ఈ కథ వేరు కొన్ని సీన్స్ ఎక్కువగా అబుదబీ, ఇటలీలో చేశాం. కొన్ని సీన్స్ బైక్ సీన్స్, జైట్వెన్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేశాం.
ఎక్కువగా ట్రైనింగ్ తీసుకోలేదా?
ట్రైనింగ్ తీసుకున్నా. కానీ బాహుబలి లాగా నెలల తరబడి తీసుకోలేదు. ఈ చిత్రానికి ఎక్కువగా టెక్నికల్ సైడ్ బాగా కష్టపడవలసి వచ్చింది.అబుదబీలో మేకింగ్ వీడియోలో మీకు తెలుస్తుది ట్రక్స్ తీసుకొచ్చి పెట్టారు. వాటితో ఒక 30కార్స్‌ని ట్రాష్ చెయ్యాలి. నేను మొదటి సారి చూశాను రిమోట్ కంట్రోల్ కార్. ట్రక్ అద్దాల నుంచి క్రాష్ అవుతుంది అది నాకు బాగా నచ్చింది. ఎక్కువ టైం ఎఫెట్స్కి పెట్టాల్సి వచ్చింది. చాలా పని ఉంది. చాలా నేర్చుకోవల్సి వచ్చింది. నేను బాహుబలి కూడా చేశాను కానీ అక్కడ రాజమౌళి ఉన్నాడు. ఇక్కడ సుజీత్ తను అర్ధం చేసుకోవాలి. మన ఎమోషన్స్‌ని వాళ్లకి చెప్పాలి. ఇలా చాలా జరిగాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఎడిటింగ్ కోసం హాలీవుడ్ ఎడిటర్స్ని ఇంట్రడ్యూస్ చేశాం. టెక్నికల్లీ చాలా పని ఉంది.
మీరు ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ చేస్తున్నారని విన్నాం?
డ్యుయల్ రోల్ కాకపోవచ్చు. చెప్పేయొచ్చు. కాకపోతే మీకు క్యురియాసిటీ ఉండాలి కదా.
సుజిత్ కథ చెప్పినప్పుడే ఈ స్కేల్, రేంజ్ చెప్పారా లేదంటే క్రమ క్రమంగా పెరిగిందా?
లేదు. ముందు అసలు నేను బాహుబలి తర్వా త యాక్షన్ చిత్రం చెయ్యకూడదనుకున్నా. ఎందుకంటే రాజమౌళి గురించి తెలుసు కదా ఆయన ప్లానింగ్ అది ఎలా ఉంటదో. నేను యాక్షన్ సినిమా చెయ్యాలనుకోలేదు. కొన్ని సీన్స్ ని తీశాద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు.
ప్రీరిలీజ్‌లో జాగ్రత్తగా తీసివుంటే వందకోట్లు దాటేదికాదు అన్నారు కదా ? తర్వాత నుంచి జాగ్రత్త పడతారా?
అది నా డిపార్ట్మెంట్ కాదు. మా ఫ్రెండ్స్ చూసుకుంటారు. న్యూటాలెంటెడ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఇందులో డిపార్ట్మెంట్స్ అన్నీ కొత్తవి. ఎప్పుడూ చెయ్యలేదు. సుజిత్‌కి కూడా కొత్త ప్రతిది తను రీసెర్చ్ చేసి చెయ్యాల్సి వచ్చింది.లొకేషన్స్ కోసం అబుదబీ 4,5 సార్లు వెళ్లవలసి వచ్చింది. అబుదబీలో ఒక ఫ్యాక్టరీని క్రియేట్ చెయ్యడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. కొన్ని కెమెరాస్, కార్లు షిప్ నుంచి రావలసి వచ్చింది.
ఈ పాత్రకోసం ఎంత వెయిట్ తగ్గారు?
బాహుబలి టైంలో ఎక్కువగానే ఉన్నా. ఇప్పుడు తగ్గటం కోసం బాగా ట్రై చేశాను కానీ మదట్లో తగ్గలేదు. తర్వాత వెజిటేరియన్ డైట్ మొదలుపెట్టాక కొంచం తగ్గాను.
యాక్షన్ సీన్స్‌లో మీకు రిస్క్ అనపించిందా దెబ్బలు ఏమైనా తగిలాయా?
లేదండి. చాలా సేఫ్టీగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చక్కగా ప్లాన్ చేశారు. మీరు సీన్స్ చూస్తున్నప్పుడు ఆటెంపో ఉంటది కానీ ఎక్కడా ప్రాబ్లమ్ ఉండదు. సేఫ్టీకే ఒక నలుగురు వరకు టీం ఉంటారు.
డూప్ అవసరం రాలేదా?
డూప్ కూడా ఉంటుంది. లేకుండా ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఐదేళ్ళక్రితం డూప్ వద్దు నేనే చేస్తా అనేవాడ్ని ఇప్పుడు అలా కాదు. చెయ్యాల్సిన టైం లో చేశాం. కదా ఇప్పుడు కొన్ని చోట్ల వాడుతున్నాను.
సాహో టెక్నికల్‌గా చాలా గ్రాండియర్‌గా కనిపిస్తుంది కంటెంట్ ఎలా ఉండబోతుంది?
ఎప్పుడూ కంటెంట్ ఇంపార్టెంట్. విజువల్ గ్రాండియర్‌తో పాటుమంచి కంటెంట్ కూడా ఉంటుంది.
ఎమోషనల్ కంటెంట్ ఉంటుందా?
ఎమోషనల్ కంటెంట్ లేకపోతే సినిమా ఉండదు. ఎమోషనల్ కూడా ఉంటుంది.
శ్రద్ధాని ఎవరు సెలెక్ట్ చేశారు?
డైరెక్టర్ సెలెక్ట్ చేశారు.
బాహుబలి క్రేజ్ వల్ల మీకు బడ్జెట్ పెంచారా?
బాహుబలి క్రేజ్ వల్ల కాదు. బాహుబలి తర్వాత ఎలా రావాలన్న భయంతో బడ్జెట్ పెంచారు.
బడ్జెట్ పెరిగాక ఆడియన్స్‌ని కన్విన్స్ చెయ్యడానికి కథలో మార్పులు చేశారా?
కథని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. రెండు ఏళ్లు సమయం ఉండడంతో మంచి డెపలప్మెంట్ జరిగింది. కథ అదే సీన్స్‌లో, డైలాగ్స్‌లో బెటర్మెంట్ చేశాం.యాక్షన్ డిజైనింగ్‌లో బెటర్మెంట్ చేశాం. కానీ స్టోరీ మాత్రం అదే.
బడ్జెట్ పెరుగుతుంటే మీ ఫీలింగ్ ఏంటి? సజిత్ని నమ్మి అంత పెద్ద బడ్జెట్ ఎలా ప్లాన్ చేశారు?
నిద్రపట్టలేదు. సుజిత్ కథ చెప్పినప్పుడే యాక్షన్ ఫీల్డ్ ఎక్కువ ఉంది. బెస్ట్ క్వాలిటీ కోసం ట్రై చేశాం. బాహుబలి ప్రాఫిట్స్ అవి దృష్టిలో పెట్టుకుని చేశాం.
దీనిక సీక్వెల్ చేస్తారా?
అన్నీ కుదిరి టైం బావుంటే తప్పకుండా చేస్తాం. కానీ వెంటనే మాత్రం కాదు కాస్త టైం పట్టుద్ది.
మీరు బయట చాలా కూల్‌గా ఉంటారు. కానీ ఎన్నుకునే సినిమాలు అన్నీ వైలెంట్‌గా ఉంటున్నాయి.?
డబ్బులు తీసుకుంటున్నాం కదండి అన్నీ చెయ్యాలి.
బాహుబలి తర్వాత రిలాక్స్ అవ్వకుండా మళ్ళీ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు?
అంటే అది సుజిత్నే అడగాలి. నేను మంచి లవ్‌స్టోరీ చేద్దామనుకున్నా. ఈయన ఏమో యాక్షన్ కథ తీసుకొచ్చాడు.
బాలీవుడ్ లో కూడా మీకు మంచి రెస్పాన్స్ ఉంది మనలానే ట్రీట్ చేస్తున్నారు మీ ఫీలింగ్?
బాలీవుడ్లో చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు .ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్.
తెలుగు, హిందీలో డబ్బింగ్ చెప్పారు ఇంకేమైనా చెపుతారా?
నెక్స్ట్ తర్వాత కుదిరితే తమిళ్ కూడా చెపుతాను.
ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ల కంటే కొత్త డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చారు?
ఇది ఒక స్క్రీన్‌ప్లే పైన నడిచే కథ. ఇది చాలా మంచి కథ. కథే మాస్టర్ డైరెక్టర్ కాదు. రాధాకృష్ణగారు కూడా బాహుబలి ఒన్ తర్వాత లవ్‌స్టోరీ చెప్పారు. చెయ్యాలి.
యాక్షన్ పార్ట్ ఎలా ఉండబోతుంది?
అంటే కథ మొత్తం యాక్షన్ యాక్షన్ అలా ఉండదు. కథ మొత్తం చాలా స్టైల్‌గా ఉంటుంది. కథకి అనుగుణంగానే యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఫైట్స్ కూడా మూడో , నాలుగో ఉంటాయి అంతే.
ఈశ్వర్ టైం టెన్షన్‌కి ఇప్పడు పడే టెన్షన్‌కి వేరియేషన్ ఏంటి?
ఈశ్వర్ టైంలో నేను ఇండస్ట్రీలో నిలబడాలనే తపన. నచ్చుతామా లేదా ఉంటామా వెళ్లిపోతామా అని. ఇప్పుడు బాహుబలి తర్వా త ఎంత ఎంటర్టైన్ చెయ్యగలం. ఇదొక రకమైన టెన్షన్, అదో రకమైన టెన్షన్.
బాలీవుడ్లో ఎవరైనా మీ క్రేజ్ గురించి మార్కెట్ గురించి డిస్కస్ చేశారా?
రణబీర్‌కపూర్, అజయ్‌దేవగన్, కాల్ చేశారు. వెరీ గుడ్ రెస్పాన్స్. రణబీర్ అయితే ఒక మూవీ చెయ్యాలన్నారు. అమీర్ఖాన్గారు కూడా నాలుగు నెలల క్రితం కాల్ చేశారు. బాంబేలో ఏదో సినిమా చూడమని. బయట డిస్కషన్స్ అక్కడ ఉండవు. అక్కడ చాలా బాగా మాట్లాడతారు.
వేరే ల్యాంగ్వేజెస్‌లో చేస్తారా?
తప్పకుండా చేస్తా.
సాహో తర్వాత మీ ఫ్యాన్స్ మీ రెమ్యూనరేషన్ గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలనుకుంటున్నారు?
రెమ్యూనరేషన్ గురించి ముందు పక్కన పెడితే నాలుగు రోజుల్లో విడుదలవుతున్న దీని సంగతేంటో చూడాలి.
సాహో పక్కన పెడితే మీకు ఈ మధ్య నచ్చిన చిత్రాలు?
కంటెంట్ ఉన్న చిత్రాలు చాలానే వచ్చాయి. అర్జున్‌రెడ్డి, నాని చేసిన జెర్సీ చాలా బాగా ఆడాయి. డిఫరెంట్‌గా ట్రై చేశారు. చిన్న సినిమాలు ఆడినప్పుడు కూడా మంచి అభినందనలు వచ్చాయి.
శ్రద్ధతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్?
శ్రద్ధ చాలా బాగా చేసింది. యాక్షన్ సీన్స్‌లో కూడా బాగా నటించింది. తనది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్టోరీ చాలా వరకు తనమీద వెళతా ఉంటది.
అందరి ప్రజర్ మీరు తీసుకుంటున్నారు మీ ప్రజర్ తీసుకునేవారు మీ లైఫ్‌లో ఎప్పుడు వస్తారు?
ప్రజర్ తీసేవాళ్లు వస్తారో పెట్టేవాళ్లు వస్తారో తెలియదు కదా. పోస్ట్ పోన్ అవ్వడానికి ప్రత్యేకించి కారణం ఏమీలేదు అలా జరుగుతుంది అంతే.
కేజీఎఫ్ డైరెక్టర్‌తో మీరు చేస్తున్నారా?
లేదండి అలాంటి డిస్కషన్స్ అసలు లేవు.
బాలీవుడ్లో మల్టీస్టారర్ చేస్తారా?
డెఫినెట్‌గా చేస్తాను. ఫ్యూచర్లో చేస్తాను.
కృష్ణంరాజు ఎలా ఫీలవుతున్నారు?
చాలా ఆనందంగా ఫీలవుతున్నారు. మా ఫ్యామిలీకి ఆయన తర్వాతే కదా. ఎవరు వచ్చినా ప్రభాస్ బాహుబలి అంటే చాలు ఆయన ఉప్పొంగిపోతుంటారు. ఎక్కువ ఆనందపడిపోయి. ఇంకొంచం లావయిపోయి. ఇలా ఫీలవుతారు.
సినిమా పెద్దనాన్నగారు చూశారా?
చూడలేదు కానీ కథ విన్నారు. ఆయనకి బాగా నచ్చింది. ఆయన ఆలోచనలు చాలా మోడ్రన్‌గా ఉంటాయి. బిల్లాలో ఆయన చెయ్యడం చాలా గ్రేట్ ఆయన చెయ్యరనుకున్నా కానీ ఆయన ఆలోచనలు చాలా మోడ్రన్‌గా ఉంటాయి. చిన్న చిన్నమార్పులు మాత్రమే చెపుతారు అనుకున్నా కానీ ఆయన నటించారు.
కొరటాలతో మళ్ళీ సినిమా చేస్తారా?
డెఫినెట్‌గా చేస్తాను. ప్రస్తుతం అయితే ఏమీలేదు.
బాహుబలికి ముందు తర్వాత ఎలా ఫీలవుతున్నారు?
మేఘాల్లో తేలుతున్నట్లు ఉంది. అంతా రాజమౌళి చేసిన మాయ అది.