సిక్స్‌ప్యాక్ పంతం మీదా… మాదా…
సిక్స్‌ప్యాక్ పంతం మీదా… మాదా…
ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ అంటే ఎంత ట్రెండింగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రెండ్‌ని అచ్చంగా ఫాలో అయిపోయే కుర్రకారు ఈ సిక్స్‌ప్యాక్ బాడీ వైపు అలాగే మొగ్గు చూపుతున్నారు.
ఏదో హీరోలు వెండితెరపై మెరిసిపోయేందుకు సిక్స్ ప్యాక్ చేశారులే. అది మన ఒంటికి పడదులే అనుకుంటే పొరపాటే. మనమూ ఆ హీరోల్లానే ఎందుకు పలకల బాడీని చూపించకూడదు అనుకుంటున్నారు కొందరు హీరోయిన్లు. అనుకోవడమే కాదు, అమాంతం ఫిట్నెస్ సెంటర్స్ పై పడిపోతున్నారు అందాల భామలు. తమ శరీరాన్ని అందంగా ఆరు పలకల ఆకృతిలోకి మార్చేసుకుంటున్నారు ఈ మెరుపు తీగలు. ఇదంతా బాగానే ఉంది.
అమ్మాయిలకూ సిక్స్ ప్యాక్ ఫీవర్
ట్రెండ్ అంటే ఓన్లీ అబ్బాయిలకే, ఓన్లీ అమ్మాయిలకే అనేం లేదు కదా. టోటల్ యూత్ ఆ మాటకొస్తే, ఆంటీస్, అంకుల్స్ కూడా ట్రెండ్‌ని ఫాలో అయిపోతున్నారు. అదీ సిక్స్ ప్యాక్ ఫిజిక్ కి వున్న క్రేజ్.
ఈ సిక్స్ ఫ్యాక్ ఫీవర్‌ని ఒంట పట్టించుకుంటున్న అమ్మాయిలు ఎవరంటే…
ముద్దుగుమ్మల్లో సిక్స్‌ప్యాక్ ఫోబియా..
ఈ సిక్స్‌ప్యాక్ ఫీవర్‌ని ఒంటపట్టించుకున్న ముద్దుగుమ్మల్లో ముఖ్యంగా ‘గురు’ ఫేం రితికా సింగ్ గురించి చెప్పుకోవాలి. చూడ్డానికి క్యూట్ గా వుండే ఈ భామని టచ్ చేశారో, బాక్సింగ్ పంచ్ ఇచ్చేస్తుంది జాగ్రత్త.
ఈ బ్యూటీ తన అందమైన శరీరాన్ని సిక్స్ ప్యాక్‌గా మలిచేసింది.రితికానే కాదు. ఇలా సిక్స్‌ప్యాక్‌ని ఫాలో అయిన ముద్దుగుమ్మల్లో ఇంకా చాలా మందే ఉన్నారు. ‘జైసింహా’ సినిమాలో బాలయ్య పక్కన హాట్ హాట్‌గా స్టెప్పులు ఇరగదీసిన బ్యూటీ నటాషా దోషీ . ఆ ముద్దుగుమ్మకి కూడా ఈ తరహా బాడీని ట్రై చేసి, ఎక్స్‌పోజింగ్‌కి పెట్టింది.
రకుల్ ప్రీత్ సింగ్ , దిశా పటానీ , అమైరా దస్తుర్ , ప్రగ్యా జైస్వాల్.. ఇలా ఒకరేమిటి, నాజూకు శరీరాన్ని ముప్పు తిప్పలు పెట్టేసి.. మెరుపు తీగల్లా మారిపోతున్న అందాల భామలెందరో వున్నారు.
సిక్స్ ప్యాక్ గురించి అనుమానాలొద్దు.!
సిక్స్ ప్యాక్ ట్రై చేస్తే ఫేస్‌లో మార్పులు వచ్చేస్తాయి. హ్యాండసమ్ లుక్ పోతుంది అనే భయం కొందరిలో ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఎంతో మంది కుర్రహీరోలు సిక్స్ ప్యాక్‌ని సింపుల్‌గా ట్రై చేసేసినా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సిక్స్ ప్యాక్ జోలికి పోలేదు.
అయితే సిక్స్ ప్యాక్ ఫిజిక్ ఉన్నా గ్లామర్‌లో ఎలాంటి తేడాలు రావని అందాల భామలే నిరూపిస్తున్నారు. అందాల భామల లెక్కలు వేరేలా వుంటాయ్ కదా. అయినా, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.. రఫ్ లుక్ కూడా ఫ్యాషన్ అయ్యింది మరి.
ప్రపంచవ్యాప్తంగా హాట్ బ్యూటీస్ చాలా మంది సిక్స్ ప్యాక్ ఫిజిక్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియాలో కూడా ఈ తరహా ఫిజిక్‌పై అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఏదైనా సాధించగలం అన్న తపనే అందాల భామలతోనూ సిక్స్ ప్యాక్ చేయించేలా చేస్తోంది.
హీరోలకు మేమేం తక్కువ కాదు..
ఇదివరకు సినిమాల్లో హీరోలతో పోటీపడి ఫైట్స్ చేయడానికి హీరోయిన్లు చాలా కష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. హీరోలకు తామేం తక్కువ కాదంటూ రంగంలోకి దూకుతున్నారు. ఆకాశంలో సగం, అన్నింటా సగమనే భావనతో దూకుడు ప్రదర్శిస్తున్నారు అన్ని విషయాల్లోనూ.
సినిమాని కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే పలు రకాలైన యాక్షన్ స్టంట్స్ నేర్చుకుంటున్నారు. కొందరు ముద్దుగుమ్మలు కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శిస్తుంటే, ఇంకొందరు నాజూకు శరీరంతోనే ఆ ఫీట్స్ వేస్తున్నారు. బికినీల్లో అందాల ఆరబోతకి ఇది మరింత ఉపకరిస్తుందనేది కొందరి భావన.
‘మేరీకోమ్’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ కాకపోయినా, ఆ స్థాయిలో ప్రియాంకా చోప్రా కసరత్తులు చేసింది. అలాగే తాప్సీ కూడా ‘నామ్ షబానా’ తదితర యాక్షన్ ఫిలిమ్స్ కోసం తన నాజూకు దేహాన్ని కొంచెం ఎక్కువే కష్టపెట్టేసింది.
యూత్ హీరోలు .. సిక్స్ ప్యాక్‌లు….
ఎపుడూ ఒకేలా ఉండదు సినిమా.. ఎప్పటికప్పుడు నటుల్లో, నటనలో, ఆహార్యంలో మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయి..హాలీవుడ్, బాలీవుడ్ లకు మాత్రమే పరిమితమైన సిక్స్ ప్యాక్‌లు టాలీవుడ్ సినిమాను చుట్టుముట్టాయి…సిక్స్ ప్యాక్ అనేది అయిదడుగుల హీరోలు చేస్తే ఒకలా, ఆరడుగుల హీరోలు చేస్తే మరోలా కనిపించడం సహజం.. బాహుబలి లో హీరో , విలన్ లు ఇద్దరూ పోటీపడి దేహదారుఢ్యాన్ని పెంచేశారు.. ప్రభాస్, రాణా ఇద్దరూ ఆరడుగుల ఆజానుబావులు కాబట్టి ఆ ఎట్రాక్షన్ వేరుగా ఉంది.. బాహుబలి హిట్లో వాళ్ళ బాడీలు కూడా పాత్రలు పోషించాయంటే అతిశయోక్తికాదు…
ఇప్పటి కుర్ర హీరోల్లో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ, బెల్లంకొండ శ్రీనివాస్‌లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారిద్దరి సినిమాలు గుణ 369, రాక్షసుడు రెండు ఆగష్టులో రిలీజుకు సిద్ధంగా ఉన్నాయి.. ఆరడుగుల హీరోలు మనకే కాదు అన్ని భాషల వారికే కొదవే… హీరో ఎత్తు కూడా సినిమా రిలీజుకు ఓపినింగ్స్ తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది.. కుర్రకారు హైట్ ను బాగా ఇష్టపడుతున్నారనేది నిర్వివాదాంశం.. అందుకే ఈ హీరోలు వాళ్ళ సినిమా ప్రమోషన్ పోస్టర్లపై సిక్స్ ప్యాక్ ప్రదర్శనలు కనిపిస్తుంటాయి…