22 movie press meet
I Am Very Confident About The Talent Of Our Shiva. He Will Score A Big Hit With ’22’ Movie Starring Rupesh Kumar Choudhary – Dashing Director Puri Jagannadh
Shiva Kumar. B who has worked in the direction department of Dashing Director Puri Jagannadh, Sensational Director VV Vinayak, Super Successful Director Maruthi is Directing an Action Thriller ’22’ starring Rupesh Kumar Choudhary, Saloni Misra as hero and heroines in Maa Aai Productions. Shiva Kumar is also providing story, screenplay, dialogues for this film. The film has completed its shooting part and is now undergoing its post-production works. The First look Glimpse of the film is unveiled by Dashing Director Puri Jagannadh. On this occasion, the team interacted with media in a press meet on Jan 7th at Daspalla Hotel, Hyderabad.
Dashing director Puri Jagannadh said, ” Shiva has worked with me for many of my films. He is now doing his first film. Shiva is the son of BA Raju garu. He is very close to me. Just now I have watched ’22’ Movie. It is too good. I have a lot of confidence over Shiva’s talent. I wish him to become a big director and score a big hit. All the best to Hero Rupesh Kumar Choudhary.”
Producer Konda Krishnam Raju said, ” After the completion of the first schedule of ’22’, While I and Raju garu were together, Raju garu received a message from Puri garu saying that he got superb feedback about Shiva. He also messaged that he is very happy for Shiva. The entire talkie part has been completed within 35 days. This shows how much planning and confidence Shiva has. I wish the entire team a bright future.”
BA Raju said, ” During the shoot of ‘temper’, Puri garu said that your Shiva will become Director very soon. I thought that he said so to encourage me. Later when I met him, he said that Shiva is very talented many times. I felt very happy as a father. All of a sudden, one day Shiva brings Rupesh Kumar along with him and said that they are starting a film with Rupesh as Hero and Producer. He said that they will start the film next week. He himself has written, readied and confirmed the project without any of my intervention. Everyone who has watched the film is giving very good feedback. I am very happy that the teaser is released on my birthday. I wish he will get good name by proving himself as Puri gari protege. Shiva is lucky to have a Hero and Producer like Rupesh. It is because of Rupesh Kumar the film has been completed in quick time. This film has given me double happiness, one is my son Shiva is directing the film while My brother’s son Kiran is the cinematographer. I am very happy that both of them are working together for this film.”
Hero Rupesh Kumar Choudhary said, ” I am very happy that the teaser of my first production is launched by Puri Jagannadh garu. Shiva garu worked with Puri garu and I did this film without knowing a single line out of my confidence towards Shiva garu. The entire credit goes to Puri Jagannadh garu and BA Raju garu. Anee Master has introduced me to Shiva garu. I will never forget her in my life. Sai Kartheek has given terrific background score. Ravi garu provided very good visuals. The shoot has gone very smoothly. It’s good to see Konda Krishnamraju garu coming here today to bless us.”
Director Shiva Kumar said, ” I have worked with Puri garu for many films. When I asked Puri garu to launch the first glimpse of our film, he said, ‘Shiva, you have worked for me for many of my films. You are like my family. No need to ask, I will surely launch it.” I am always indebted to him for taking me and gave me the opportunity to work with me. He appreciated our entire team after watching the teaser. He is impressed with the background score given by Sai Karthik. I will never forget that Puri garu launched our teaser. Thanks to Puri garu, Charmme garu and Puri Connectsfor adjusting the dates of heroine Saloni Misra for our film. Sai Kartheek garu excited when I narrated the story. DOP Ravi Kiran worked in Mumbai. The entire film will have a look and feel shot by a Mumbai cinematographer. Thanks to Addala Raju garu for lively sets. Editor Shyam’s editing is crisp and to the point editing. My journey with Rupesh garu has started over one and a half years ago. Thanks to Rupesh Kumar garu for believing me and for giving me this opportunity. He encouraged me and provided me whatever I asked for the film. Thanks to Maa Aai Productions and the entire team. Thanks to each and everyone who worked with me for this film.”
Cinematographer RaviKiran said, ” I have seen this film very recently, Editor Shyam did a very good job. My confidence got increased after watching the film. Thanks to Shiva and Rupesh for this opportunity.”
Music Director Sai Kartheek said, ” Shiva filmed this movie quickly with superb clarity. He made this film exactly with a duration of 2 hours 2 Mins like he said before starting the film. The film came out very well. As he was worked with Puri garu, He got the same speed and clarity in making the film. RR is coming out superbly. I wish Shiva to become a big director with this film.”
Art Director Peddiraju Addala said, ” Our entire team worked very hard for this film. The film has shaped out good. Thanks to the Director and Producer for this opportunity.”
Rupesh Kumar Choudhary, Saloni Misra, Vikram Jeet Virk, Devi prasad, Jaya Prakash, Ravi Varma, Sasidhar Kosuri, Fidaa Saranya, Rajashri Nair, Pooja Ramachandran, Krishna Chaitanya, Afghanistan Rama Raju, baby Samskruthi, Master Tarun, Master Devansh, Baby Ojal and others are the principal cast.
Cinematography: BV RaviKiran, Music: Sai Kartheek, Editing: Shyam Vadavalli, Choregraphy: ANee Lama, Art: Peddiraju Addala, Action: Stunt Jashuva, Lyrics: Bhaskarabhatla, Kasarla Shyam, Production Manager: Kiran Kasa, PRO: BA Raju, Chief Co-director: Pullarao Koppineedi, Producer: Smt Susheela Devi, Story – Screenplay – Dialogues – Direction: Shiva Kumar. B
మా శివ టాలెంట్‌మీద గట్టి నమ్మకం ఉంది, రూపేష్‌కుమార్ చౌదరితో చేసిన `22`మూవీతో పెద్ద హిట్ కొడతాడు – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జనవరి 7న హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ”శివ నాతో కలిసి చాలా సినిమాలకు వర్క్ చేశాడు. ఫస్ట్‌టైమ్ సినిమా చేస్తున్నాడు. శివ ఎవరో కాదు బి.ఎ.రాజుగారి అబ్బాయి. నాకు బాగా కావాల్సినవాడు. ఇప్పుడే ’22’ మూవీ చూశాను. చాలా బాగుంది. బేసిగ్గా శివ మీద నాకు నమ్మకం ఉంది. చాలా టాలెంటెడ్. పెద్ద డైరెక్టర్ కావాలి. పెద్ద హిట్ కొట్టాలి. అలాగే హీరో రూపేష్ కుమార్‌కి ఆల్ ది బెస్ట్” అన్నారు.
నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – ”22′ మొదటి షెడ్యూల్ అయ్యాక ఒకరోజు రాజుగారు, నేను, కల్సి ఉండగా రాజుగారి సెల్‌కి పూరిగారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ‘మనోడు ఇరగదీసేస్తున్నాడంట. నాకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ శివ`అని ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉండి కూడా శివ గురించి హ్యాపీగా ఫీలై మెసేజ్ చేశారు. శివ 35 రోజుల్లో టాకీ పూర్తి చేశాడు. ఎంత ప్రీ ప్రొడక్షన్ చేసుకొని, ఎంతో ప్లానింగ్, కాన్ఫిడెన్స్ ఉంటేనే అంత తొందరగా షూటింగ్ పూర్తి చేయగలడు. టీమ్ అందరికీ మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”టెంపర్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు పూరిగారు ‘మీ శివ తొందరగా డైరెక్టర్ అయిపోతాడు అని’ చెప్పారు. నేను ఎంకరేజ్ చేయడానికి అలా చెప్పారు అనుకున్నా. తర్వాత కలిసినప్పుడు కూడా చాలాసార్లు మీవాడు చాలా టాలెంటెడ్ అని చెప్పారు. ఒక ఫాదర్‌గా చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సడెన్‌గా ఒకరోజు రూపేష్కుమార్గారిని తీసుకొచ్చి సినిమా స్టార్ట్ చేస్తున్నాం. తనే హీరో, ప్రొడ్యూసర్. నెక్స్ట్ వీక్ సినిమా ఓపెనింగ్ అని చెప్పాడు. అలా నా ప్రమేయం లేకుండానే కథ రాసుకొని, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంతే. సినిమా చూశాక కూడా అందరూ చాలా బాగుందని అంటున్నారు. నా పుట్టినరోజు నాడు ఈ సినిమా టీజర్ రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్‌గా పూరిగారి శిష్యుడుగా అందరి ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాను. శివకి రూపేష్లాంటి హీరో, ప్రొడ్యూసర్ దొరకడం చాలా లక్కీ. సినిమా ఇంత తొందరగా పూర్తి అయ్యిందంటే దానికి కారణం రూపేష్‌కుమార్. మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి కిరణ్ సినిమాటోగ్రాఫర్.ఇద్దరూ ఒకే సినిమాకి వర్క్ చేయడం నాకు డబుల్ హ్యాపీనెస్ ” అన్నారు.
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – ”నా ఫస్ట్ ప్రొడక్షన్ టీజర్ పూరి జగన్నాథ్‌గారి చేతులమీదుగా లాంఛ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. శివగారు పూరిగారి దగ్గర వర్క్ చేశారు కాబట్టి ఏ లైన్ వినకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఈ క్రెడిట్ అంతా పూరి జగన్నాథ్‌గారికి, బి.ఎ.రాజుగారికే చెందుతుంది. ఆనీ మాస్టర్ నన్ను శివగారికి సరిచయం చేశారు. ఆవిడను లైఫ్‌లాంగ్ మర్చిపోలేను. సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. రవిగారు మంచి విజువల్స్ ఇచ్చారు. షూటింగ్ అంతా చాలా సజావుగా జరిగింది. కొండా కృష్ణంరాజుగారు ఇక్కడికి వచ్చి మా సినిమాకి బ్లెస్సింగ్స్ అందించడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
దర్శకుడు శివకుమార్ మాట్లాడుతూ – ”పూరిగారితో నేను చాలా సినిమాలకు వర్క్ చేశాను. పూరిగారి దగ్గరకెళ్ళి మా సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ మీ చేతులమీదుగా లాంచ్ చేయాలి అనగానే వెంటనే ‘శివ నువ్వు నా మనిషివి. నా దగ్గర చాలా సినిమాలకు వర్క్ చేశావు. నువ్వు అడగాలా’ అని వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆయన దగ్గర వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. టీజర్‌ని చూసి మా యూనిట్‌ని అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా సాయికార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి బాగా ఇంప్రెస్ అయ్యారు. పూరి గారు మా టీజర్ రిలీజ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే మేం అడగ్గానే సలోని మిశ్రా డేట్స్ అడ్జెస్ట్ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్ పూరి, ఛార్మిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సాయికార్తీక్గారికి కథ చెప్పగానే వెంటనే `మనం సినిమా చేస్తున్నాం`అన్నారు. డిఓపి రవికిరణ్ ముంబాయిలో వర్క్ చేశారు. సినిమా అంతా ఒక ముంబాయి సినిమాటోగ్రాఫర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే మంచి సెట్స్ వేసిన అడ్డాల రాజుగారికి థాంక్స్. ఎడిటర్ శ్యామ్ ప్రతి సీన్ కూడా క్రిస్పీలా ఉండేలా పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఇచ్చారు. రూపేష్గారితో నా జర్నీ ఏడాదిన్నర క్రితం స్టార్ట్ అయ్యింది. నా మీద నమ్మకం ఉంచి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రూపేష్కుమార్గారికి ధన్యవాదాలు. నేను సినిమా కోసం ఏం అడిగినే ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మా ఆయి ప్రొడక్షన్స్, టీమ్ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాలో నాతో పాటు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు“అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రవికిరణ్ మాట్లాడుతూ – ”మొన్ననే సినిమా చూశాను. శ్యామ్ ఎడిటింగ్ బాగా చేశారు. చూశాక కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివ, రూపేష్గార్లకి థాంక్స్.” అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ – ”శివ ఈ సినిమాని చాలా క్లారిటీగా, స్పీడ్‌గా తీశాడు. ముందుగా చెప్పినట్టే ఎగ్జాక్ట్‌గా రెండు గంటల రెండు నిమిషాలు తీశారు. సినిమా చాలా బాగా వచ్చింది. పూరిగారి దగ్గర వర్క్ చేశాడు కాబట్టే అదే స్పీడ్, అదే క్లారిటీతో సినిమా తీశాడు. ఆర్.ఆర్. బాగా వస్తోంది. ఈ సినిమాతో శివ పెద్ద డైరెక్టర్ కావాలి” అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడుతూ – ”టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి ధన్యవాదాలు” అన్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్:పెద్దిరాజు అడ్డాల, యాక్షన్:స్టంట్ జాషువ
, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, పిఆర్ఓ:బి.ఎ రాజు,చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.