40 years for shankarabharanam
శంకరాభరణం
తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం.
ఒక సినిమా చూస్తున్నప్పుడు
ఏడ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.
కానీ శంకరాభరణం సినిమాలో
చాలా సన్నివేశాలు ఎడిపించేస్తాయి,
సినిమాలో ప్రతి సీన్ ఒక ఆణిముత్యం,
ప్రతి సీన్ మెదడును తాకి
మనుసుని తడిపేసేదే.!
కొన్ని సినిమాలు ప్రేక్షకుల కోసం పుడతాయి,
కొన్ని సినిమాలు నటులు కోసం పుడతాయి,
కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో
నిలిచిపోవడానికి పుడతాయి.
అలాంటి సినీమాల ప్రస్తావన వస్తే,
శంకరాభరణం ముందు వరుసలో కూర్చుంటుంది.
ఓ సాయంకాలం,
ఊరి చివర కాలువ గట్టుపై కూర్చుంటే
సూర్యాస్తమయం దాటి
చల్లని గాలులు తరువాత
వెన్నల రాత్రుల్లో కూర్చుని మాట్లాడిన,
ఒక రాత్రి,
సిటీ Ac Room లో కూర్చుంటే
చుట్టూ ఉన్న చీకటిని దాటి,
కిటికీ మధ్యలోనుండి వచ్చిన
పగటి వెలుగులు మన ముఖంపై పడినంతవరకు మాట్లాడిన,
ఈ సినిమా గొప్పతనాన్ని పూర్తిస్థాయిలో
చెప్పలేకపోయానే అని అసంతృప్తి మనలో
మిగిల్చే సినిమే శంకరాభరణం.!
సినిమా అంటే ఇక్కడనుండి
వేరే ఊహలోకంలో తీసుకెళ్ళేదని
కొన్ని సినిమాలు నిరూపిస్తే,
మన జీవితాన్ని మనకు చూపించి
జీవితాంతం మనకు గుర్తుండిపోయేలా
అనిపించేవి కొన్ని సినిమాలు.!
ఒకప్పుడు ఈ సినిమాని
అర్ధం చేసుకునే వయస్సు లేదు,
ఇప్పుడు ఈ సినిమాని
మర్చిపోయే ఉద్దేశ్యం లేదు.
February 2 1980
40 Years Of Shankarabharanam