71 Republic day celebration @ Public Gardens

పబ్లిక్ గార్డెన్స్ లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు