90ml Director Sekhar Reddy interview
నేను తాగమని చెప్పట్లేదు హీరో తాగకపోతే ఉండలేడు అని చూపిస్తున్నాం
Rx100 మూవీ ఫేమ్ కార్తికేయ గుమ్మడికొండ హీరోగా నటిస్తున్న 90 Ml చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ 90ml సినిమా గురించి బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి,
ఇది తాగుబోతుల సినిమా కాదు,
ఒక డీసీజ్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి కథను చూపించడం జరిగింది ఈ సినిమాలో ఇది కేవలం కల్పించిన కథ మాత్రమే,
ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేసినది మాత్రమే ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదు, వాస్తవానికి నిజ జీవితంలో జరిగినది అయితే కాదు,
ఈలాంటి కథ అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే రాలేదు.
కార్తికేయతో మీ పరిచయం ఎలా ఏర్పడింది.?
Rx100 డైరెక్టర్ అజయ్ భూపతి నా ఫ్రెండ్ ఆయన ద్వారా నాకు పరిచయం.
90ml అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూస్తారా.?
ఏ సినిమా అయినా అందరు చూడలని తీస్తే అది మనం తీయలేము,
ఏ కథ అయిన ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సినిమాని మాత్రమే తియ్యగలం,
అందరికి నచ్చే కథలు అంటే కష్టం.
మందు,సిగరెట్లు avoid చేయమని చెప్తారు కానీ మీరు 90ml అని టైటిల్ పెట్టారు .?
ఈ సినిమాలో తాగమని నేను చెప్పట్లేదు అండి, ఈ కథలో హీరో తాగకపోతే ఉండలేడు అని చూపిస్తున్నాం అంతే.
కార్తికేయ గారు ఎలా పెర్ఫార్మన్స్ చేశారు .?
చాలా బాగా చేసారండి, హీరోస్ కామెడి చేయడం అంటే మనం చిరంజీవి గారిని, రవితేజ గారిని చూసాం ఇప్పుడు కార్తికేయ గారు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు.
Rx100 లా ఏమైనా ఉండబోతోందా .?
దానికి దీనికి అస్సలు సంబంధం లేదండి అది ఒక రియల్ స్టోరీ నీ ఆధారంగా తీసుకుని తీశారు,
ఇది కంప్లీట్ ఎంటర్టైనర్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా .?
ప్రస్తుతానికి ఏమి లేదండి కంప్లిట్ గా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాను ప్రస్తుతం.