90ml movie review
90 Ml- కిక్ పూర్తిగా ఎక్కలేదు
నటీనటులు-కార్తికేయ,నేహా సోలంకి,రవికిషన్,రావూ రమేష్,అలీ,పోసాని కృష్ణమురళి
దర్శకత్వం-శేఖర్ రెడ్డి
నిర్మాత-అశోక్ గుమ్మకొండ
సంగీతం-అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ-యువరాజ్
కార్తికేయ గుమ్మకొండ,నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 90Ml చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
దేవదాసు (కార్తికేయ) పుట్టడమే ఫెటల్ ఆల్కహాలిక్ డిజాస్టర్ తో పుడతాడు.అయితే అతను ఆల్కహాల్‌కి మాత్రమే రియాక్ట్ అవుతుండడంతో డాక్టర్ మాట ప్రకారం ఇంట్లో వాళ్ళు 3 పూటలు ఆల్కహాల్ అలవాటు చేస్తారు, అలా తన జీవితంలో ఆల్కహాల్ ఒక భాగం అయిపోతుంది.
అలాంటి దేవదాస్, సువాసన(నేహా సోలంకి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ సువాసనకి, ఆమె ఫ్యామిలీకి మాత్రం అసలు అలాంటి అలవాట్లు ఉన్నవాళ్లు నచ్చరు. కానీ దేవదాసు ఆల్కహాల్ లేకపోతే బ్రతకలేడు అనే విషయం సువాసన తెలియకుండానే ప్రేమలో పడుతుంది.కానీ ఒక సంఘటనలో ఆ విషయం తెలుస్తుంది. దాంతో ఆమె అతనికి బ్రేకప్ చెబుతుంది.దేవదాస్ కి ఉన్న ప్రాబ్లమ్ గురించి సువాసన ఎలా తెలిసింది, మళ్ళీ వాళ్ళిద్దరూ ఎలా కలిసారు,ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఏంటి అని సినిమాలో చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమాని పూర్తి కమర్షియల్ వే లో నడిపించాడు దర్శకుడు శేఖర్ రెడ్డి,ఒక సాధారణ ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి ఏమి కోరుకుంటాడో అది మాత్రం ఇవ్వగలిగాడు దర్శకుడు.
కార్తికేయ తనకున్న పాత్ర పరిధిలో బాగా చేసి మెప్పించాడు,కామెడీ టైమింగ్,డాన్స్,ఫైట్స్ అన్నింటిలోనూ తనదైన శైలితో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు,హీరోహిన్ గా నేహా పర్వాలేదు అనిపించింది, బ్రేకప్ సీన్స్ లోను మరింత బాగా నటించింది.
సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది,మాస్ సాంగ్స్ అన్ని కార్తికేయ డాన్స్ కి బాగా వర్కౌట్ అయ్యాయి,సెకండాఫ్ లో వచ్చే బ్రేకప్ సాంగ్ పర్వాలేదు అనిపిస్తుంది.
యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తుంది,
ఒక కొత్త పాయింట్ ను తీసుకున్న డైరెక్టర్ రెగ్యులర్ సీన్స్ లా కాకుండా ఇంకొంచెం కొత్త సీన్స్ క్రియేట్ చేస్తూ,
హీరోహిన్ కి హీరో ప్రాబ్లమ్ చివరివరకు తెలియకుండా ఉండేటట్లు కాకుండా కొంచెం ముందుగా చెప్పేసి కథను ఇంకొంచెం ఆసక్తికరంగా నడిపించి ఉంటే ఆడియన్స్ కి కంప్లీట్ కిక్ ఎక్కేది.
ఓవర్ ఆల్ గా ఆడియన్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ఒక కంప్లీట్ ఎంటర్టైనర్.
Rating-2.5