నాగార్జునతో ఢీ కొడుతున్న అనసూయ

నాగార్జునతో ఢీ కొడుతున్న అనసూయ
ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అన్న సామెత ఊరికే రాలే దు అంటున్నారు కొందరు. ఎందువల్లనంటే ‘జబర్దస్త్’ యాంకర్, నటి అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇకపోతే తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. రాజేష్ నాదెండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన ‘కథనం’ ట్రైలర్లో అనసూయ క్యారెక్టర్ హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా అనసూయ మీడియాకు ఇంటర్వూ ఇవ్వాలి. అదే రోజు ఆగస్టు 9న నాగార్జున నటించిన మన్మధుడు 2 విడుదల కానుంది. ఈ సందర్భంగా మొన్న తను ఓ సందర్భంలో మీడియాకు ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. నేను నాగార్జున గారికి పోటీ కాను అని. ఓ పక్క అలా అంటూనే మరో పక్క తన ప్రమోషన్స్‌ని పక్కన పెడుతుంది. అంటే మొన్న రకుల్ ఇంటర్వూ రోజున ఈమె ఇంటర్వూ కూడా ప్లాన్ చేశారు పీఆర్ ఓ. కానీ రకుల్ ఉండగా ఆమెను పెద్దగా పట్టించుకోరని ఆరోజు వాయిదా వేయించింది. రెండవ రోజు పెట్టించి మళ్ళీ నాగార్జున గారి ఇంటర్వూ ఉండడంతో ఆ రోజు కూడా వాయిదా వేయించింది. వీటన్నిటినీ చూస్తుంటే ఓపక్క మన్మధుడు 2 నాగార్జునకు పోటీ కాదంటూనే పోటీ పడుతుందని అర్ధమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అన్న చందగా ఉంది ఈమె ప్రవర్తన.
ఒకప్పుడు అప్పుడప్పుడూ మాత్రమే సినిమాల్లో కనిపించిన అను.. ఇప్పుడు వరస సినిమాలు చేస్తూ రచ్చ చేస్తుంది. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి సినిమాల తర్వాత ఈమె ఇమేజ్ పెరిగిపోయింది. దాంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది అనసూయ. ఈమె కోసం స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనసూయ హీట్ పెంచేస్తోంది. ఈ ఫొటోలకు ఫిదా అయిపోతున్న ఆమె అభిమానులు సూపర్, సెక్సీ, క్యూట్ అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇక అవకాశాలు ఎక్కువయ్యే సరికి రంగమ్మత్తకి కాస్త డమాండ్ పెరిగిందని భావిస్తూ కొంత తోక జాడిస్తున్నట్లు భావిస్తున్నారు కొందరు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా ఉంటదో తెలియదనుకుంట పాపం ఈమెకి అని కొందరు మండిపడుతున్నారు.