Pooja special dance in Mahesh movie
మహేష్ చిత్రంలో పూజా డ్యాన్స్
‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఐతే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు జగపతి బాబును ఎంచుకున్నారు. టీజర్ లో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ అజయ్‌కృష్ణగా కనిపిస్తున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ సాగిన బ్యాగ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ఎఫ్ 2 సినిమాతో బంపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం హైలైట్. ఏకే ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగును ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో తమన్నా నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తమన్నా బదులుగా తాజాగా పూజా హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపులో చిత్రీకరించారు. అయితే ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు కనిపించేది సినిమా మొత్తం కాదని, కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. తొలిసారిగా ఈ చిత్రంలో ఆర్మీఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమా మొదటి భాగంలో వస్తుందని, ఆ తర్వాత అసలు సినిమా కథలోకి ఎంటరవుతుందని టాక్. ఇక భగభగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది.