Lavanya Tripathi New Stills
ఈ సినిమాకి మొదట నేను నో చెప్పాను…….
నిఖిల్ సిద్ధార్థ్ అండ్ లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా నటి లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించారు
ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది.?
ఎందుకంటే నాకు ఒక మంచి మూవీ దొరకలేదు ఇన్ని సినిమాలు చేసిన తరువాత బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చెయ్యడం కాకుండా మంచి స్క్రిప్ట్ ను చేసుకుంటూ వెళదాం అనిపించింది.!
ఈ మధ్య రిజక్ట్ చేసిన సబ్జెక్ట్ లు ఏమైనా ఉన్నాయా.?
చాలా ఉన్నాయి, కానీ వాటిలో స్ట్రాంగ్ కేరెక్టర్స్ లేవు,నేను ఒక స్ట్రాంగ్ కేరెక్టర్ కోసం ఎదురు చూస్తున్నాను.
సినిమాకి నో చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా.?
నో చాలా ఈజీ, కెరియర్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు ఒక 15,16 సినిమాలు చేసాను కాబట్టి కొంచెం ఖరేజా వచ్చి ఈజీ గా చెప్తున్నా. ఆడియన్స్ లైక్ చేసే కేరెక్టర్ నే నేను చేయాలి అనుకున్నాను అంతే.!
ఈ సినిమా చేయడానికి ఏమైనా కారణం ఉందా.?
ఈ సినిమాకి మొదట నేను నో చెప్పాను,ఈ కథను విన్న తరువాత నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను ఈ సినిమాలో గర్ల్ కేరెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఈ సినిమా రీమేక్ అయినా తమిళ్ సినిమాతో కంపెర్ చేస్తే ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ సేమ్ డైరెక్టర్.!
ఈ సినిమాలో మీ కేరెక్టర్.?
ఈ సినిమాలో నేను జర్నలిస్ట్ గా చేసాను,ఈ సినిమాలో మంచి సీన్ ఉంది అది నేను ఇప్పుడు చెప్పను నేను స్టంట్స్ కూడా చేసాను అవి కొంచెం డేంజర్ అయినా నేను నిజంగా ఎంజాయ్ చేసాను.నేను కొత్తగా ఏదో చేస్తున్నాను అని ఫీలింగ్ అయితే కలిగింది.
మీరు యాక్షన్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారా.? మీరు యాక్షన్ ఫిలిమ్స్ చేస్తారా .?
యస్ ఐ యామ్ ఏ అధ్లాటిక్ పర్సన్ సో అందుకే నేను ఎక్కువగా అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతాను
ఇప్పుడు ఇంకా ఏమైనా చేస్తున్నారా .?
నేను నెక్స్ట్ ఫిల్మ్ లో హాకీ ప్లేయర్ గా చేస్తున్నాను,ఇంకా బైక్ రైడింగ్ కూడా ఉంటుంది ఇది నాకొక కొత్త ఎక్సాపీరియన్స్ ఈ డిసెంబర్ నుండి హాకీ నేర్చుకుంటాను.
మీరు కూడా స్పోర్ట్స్ పర్సన్ ఆ.?
యా….యా… ఐ లవ్ స్పోర్ట్స్ ఐ ప్లే టేబుల్ టెన్నిస్,నేను బ్యాట్ మెంటేన్ ఆడటానికి ఇష్టపడతాను,ఇప్పుడు అందరూ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు అని కాకుండా ఈ సినిమా చేస్తున్నాను.
ఈ ఖాళీ టైం లో ఏమి చేస్తుంటారు.?
ఐ వస్ ట్రావలింగ్,జిమ్నాస్టిక్స్ చేస్తుంటాను, పుష్కర్ కి వెళ్తుంటాను.!
చాలామంది సినిమాలు లేనప్పుడు డిప్రెస్సన్ లోకి వెళ్తారు , మీకు ఏమనిపిస్తుంది .?
నేను ఎప్పుడు అలా అయ్యో నాకు సినిమాలు రావట్లేదు అని ఫీల్ అవ్వట్లేదు,ఒకవేళ నాకు ఎప్పుడు సినిమాలు రాకపోయినా నన్ను నేను నమ్ముకుంటా మిగతవాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను.
మీ కేరెక్టర్ గురించి కాకుండా ఈ సినిమా గురించి చెప్పండి .?
నిఖిల్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా మంచి కేరెక్టర్ చేసాడు ఈ సినిమాలో మంచి ట్విస్ట్ లు ఉంటాయి.
ఈ సినిమా ఎప్పటినుండో వాయిదా పడుతూ వచ్చింది , మీరు ఎలా ఫీల్ అయ్యారు .?
ట్రైలర్ రిలీజ్ కంటే ముందు ఏదోలా అనిపించింది, బట్ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ చూసాక నాకు ఈ సినిమా పై గట్టి నమ్మకం పెరిగింది.!