Arjun Suravaram press meet
నేను డైరెక్టర్ తో చాలా సార్లు గొడవపడ్డ – నిఖిల్ సిద్దార్థ్
నిఖిల్ సిద్ధార్థ్,లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన “అర్జున్ సురవరం” చిత్రం 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయం సాధించింది.
నటుడు నాగిరెడ్డి మాట్లాడుతూ…
అర్జున్ సురవరం అనే పరీక్ష రాసి రిజల్ట్ కోసం wait చేసాం,
మెగాస్టార్ చిరంజీవి గారి మాటలుతో మేము పాస్ అయిపోయాము అని నమ్మకం కలిగింది.నిఖిల్ మంచి సపోర్ట్ చేసాడు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ….
సినిమా ఇంత హిట్ అవుతుందని అని ఉహించలేదు,చాలా హ్యాపీ గా ఉంది,
నిర్మాతలు ఠాగూర్ మధు,రాజ్ కుమార్ గారు నిజంగా ఒక ఫ్రెండ్స్ లా ఉండేవారు సెట్ లో,నిఖిల్ స్వామిరారా సినిమా నాకు ఇష్టం నాకు చాలా ఇష్టం,
సత్య,వెన్నెల కిషోర్ అందరిని సినిమాటోగ్రఫీ సూర్య గారు చాలా అందంగా చూపించారు.
నిఖిల్ మాట్లాడుతూ….
అర్జున్ సురవరం ఒక సినిమా మాత్రమే కాదు,ఒక మీడియా పవర్ ఏంటో చూపించే సినిమా,ఈ సినిమా చూసి చాలా మంది ఫోన్ చేసి హిట్,సూపర్ హిట్ అని మాత్రమే కాకుండా రెస్పెక్ట్ బుల్ ఫిల్మ్ అని చెబుతున్నారు.
టాప్ డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ కాల్ చేసి మంచి విషస్ చెప్పారు.
నేను డైరెక్టర్ గారు చాలా సార్లు ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం (నవ్వుతూ) ఠాగూర్ మధు గారు డైరెక్టర్ ని డిస్టర్బ్ చేయకు అని చెప్పేవారు అంత మంచి మనిషి ఆయన.
మ్యూజిక్ డైరెక్టర్ శ్యాం సియస్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.
ఈ సినిమా అందరి కష్టం.ఈ సినిమాకి చిరంజీవి గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది.
ఠాగూర్ మధు గారు మంచి కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పారు.