WWW Movie Pre Release Event Photos
`WWW ‘ will definitely be a fantastic film – MP Raghu Rama Krishna Raju
Suresh Productions Presents, Popular Cinematographer KV Guhan upcoming directorial is ‘WWW’(who, where, why). Adith Arun and Shivani Rajashekar are playing the lead roles for this first computer screen-based film. Dr. Ravi Prasad Raju Datla is producing this film under Ramantra Creations banner. The pre-release event of this film was held in Hyderabad. YSRCP MP Raghu Rama Krishna Raju, Dr. Rajasekhar, Jeevitha Rajasekhar attended as chief Guests. On this occasion, MP Raghu Rama Krishna Raju Launched Ramantra Creations Banner Logo.
MP Raghu Rama Krishna Raju said: Dr. Ravi Prasad Raju Datla was an Engineer. He has much passionate about cinema and Literature. The banner logo is impressive. I hope the film also matches the logo. Shivani Rajasekhar Performed well in this film. Adit Arun will go to the next level after this film. I can’t recognize Veerappan actor had in this film. This is a good team Visionary Director, Producer, Hero and Heroine will make this film a great success. I am waiting for December 24 for this film release.
Dr. Rajasekhar Said: KV Guhan is a wonderful Technician. I am so happy after knowing my daughter Shivani is doing this film. They said the Film is coming in a quick time, but now it is releasing at the right time. I have not watched this film so far will watch it soon. I would like to work with KV Guhan Garu. Adith knows what’s happening in the industry. we met each other at the time of Garuda Vega. irrespective of age differences we had spent good time like friends. He is our family member. He had done a lot of hard work for this film. I will remember some moments when I heard the name ‘WWW’. I have not been panicked by covid, Shivani affected With Corona from this team, I have been affected by her. Shivani was upset because dad got corona because of me. I didn’t forget this life. ‘WWW’ will play an important role in our lives. unforgettable film ‘WWW’ releasing on December 24. Everyone wishing ‘WWW’ will receive great applause like ‘Adbhutam’. I feel so happy for Shivani that she made me proud. I wish all the audience will watch this film.
Jeevitha Rajasekhar said: When they are childhood our kids will visit our shootings frequently. Rajasekhar garu used to take along with him when he went for outdoor shootings. They used to stand behind the camera at that time, Now they came forward. When they have grown up, they said they are interested in movies. I advised them not to get into depression and choose another path if they didn’t get success in films. Shivan’s recent film ‘Adbutam’ became a good success. I like the song ‘Nailu Nadhi’. First of all, I would like to speak about Producer. He advised Even one shot or one word should not be vulgar. He produced this film with a lot of burdens. The film is releasing on December 24. Thanks to SonyLIV. I wish This film becomes good success. Adit and Shivani had done a lot of hard work. Director KV Guhan completed this film in 20days.
Director KV Guhan Said: Jeevitha and Rajasekhar treated me as their family member. We had shot everything on the webcam. At the time of Covid Lockdown, we have started shooting for this film. The Producer heard the story online. He believed us and spent the money on this film. Adit and Shivani had done a great job. Tammiraju’s editing is tremendous. The artwork was done by my wife Ponmanee. She had done a great job. Thanks to all who had worked on this film.
Producer Dr. Ravi Prasad Datla Said: Thanks to Jeevitha and Rajasekhar for their immense support for this film. Only Because of KV Guhan this film comes out well. I have had much passion for cinema since childhood. Dil Raju Appreciated us after watching our film. Suresh Babu supported our film very well. ‘WWW’ Released on December 24 on SonyLIV. I hope everyone will like our film.
Hero Adith Arun Said: ‘WWW’ made and released in four languages. When I was in low, Garuda Vega gave me a lot of boost for my career. Jeevitha and Rajashekar are inspirations to all the parents for making their daughter a heroine. We have got a lot of confidence after Adithya Music bagged the rights. This is my 15th film. This film is released on SonyLIV on December 24.
Heroine Sivani Rajashekar Said: I have got this project only because of Adith. Thanks to Guhan Garu for believing in me also Thanks to Simon K King for Tremendous music and BGM. The movie is released on December 24 on SonyLIv.
విజనరీ టీమ్ కలిసి చేసిన` డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` కచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా అవుతుంది – ఎంపీ రఘురామకృష్ణ రాజు
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. `సోనిలివ్`లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు, హీరో రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ లోగోను ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆవిష్కరించారు.
ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నిర్మాత రవి గారు ఓ ఇంజనీర్. కానీ ఆయనకు సినిమా పట్ల, సాహిత్యం పట్ల ఎంతో ప్రేమ ఉంది. నాక్కూడా సినిమాలు, సాహిత్యం అంటే ఇష్టం. కానీ నేను సినిమాలు తీయలేకపోయాను. ఆయన తీశారు. బ్యానర్‌లోగో అద్బుతంగా ఉంది. సినిమా కూడా అలానే ఉండబోతోంది. శివానీ రాజశేఖర్ గారు అద్బుతం సినిమాలో ఎంతో బాగా నటించారు. అదిత్ కూడా ఈ సినిమా తరువాత వేరే స్థాయికి చేరుకుంటాడు. వీరప్పన్ నటుడే ఇందులో ఉన్నాడని గుర్తు పట్టలేదు. ఇది మంచి టీం. విజనరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ ఈ నలుగురు కలిసి చేసిన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు కచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది. డిసెంబర్ 24న రాబోతోన్న ఈ సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘గుహన్ గారు వండర్ ఫుల్ టెక్నీషియన్. ఆయనతో శివానీ సినిమా చేస్తుందని తెలియడంతో ఆనందమేసింది. సినిమా ఫాస్ట్‌గా వస్తుందని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ సమయానికి వస్తోంది. నేను ఇంకా సినిమా చూడలేదు. త్వరలోనే చూస్తాను. గుహన్ గారితో పని చేయాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అదిత్‌కు తెలుస్తుంది. గరుడ వేగలో మా పరిచయం జరిగింది. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్స్‌లా తిరిగాం. ఆయన మా ఫ్యామిలీ మెంబర్. చాలా కష్టపడి ఈ సినిమాను చేశాడు. www అంటే నాకు జీవితంలో కొన్ని గుర్తుకువస్తాయి. కోవిడ్‌ను చూసి నేను భయపడలేదు. ఈ టీం నుంచే శివానికి కరోనా వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. నా వల్ల డాడీకి వచ్చిందని శివానీ బాగా ఏడ్చేసింది. ఈ జీవితాన్ని నేను ఎప్పుడూ మరిచిపోను. ఈ చిత్రం మా జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. మరిచిపోలేని ఈ సినిమా డిసెంబర్ 24న వస్తోంది. అద్భుతం సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో.. ఈసినిమాకు కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది. నా పేరు నిలబెట్టిందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మా పిల్లలు ఎప్పుడూ షూటింగ్‌లకు వచ్చేవారు. రాజశేఖర్ గారు అవుట్ డోర్‌కు వెళ్తే తీసుకెళ్లేవారు. అప్పుడు కెమెరా వెనక ఉండేవారు. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఊహ వచ్చాక సినిమాల్లోకి వస్తామని మాతో నేరుగా చెప్పేశారు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్లొద్దు.. వేరే కెరీర్ ఎంచుకోవాలని అన్నాం. శివానీ నటించిన అద్భుతం సినిమా మంచి విజయం సాధించింది. నైలు నది అనే పాట నాకు చాలా ఇష్టం. ఒక సినిమా ఒక హీరో లేదా ఇద్దరు హీరోలుంటారు. కానీ ఈ సినిమాకు నలుగురు హీరోలు. అదిత్, గుహన్, సైమన్, నిర్మాత గారు. ముందుగా నిర్మాత గురించి మాట్లాడాలి. ఒక్క మాట, ఒక్క షాట్ కూడా అసభ్యంగా, అశ్లీలంగా ఉండొద్దని అన్నారు. ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను నిర్మించారు. 24న ఈ చిత్రం రాబోతోంది. సోనీ లివ్ సంస్థకు థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు. శివానీ కూడా కష్టపడి చేసింది. గుహన్ గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారు. అంత ఫాస్ట్‌గా ఎలా తీశారా? అని నేను షాక్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు గుహన్ మాట్లాడుతూ.. ‘జీవిత, రాజశేఖర్ గారు నన్ను ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. పూర్తిగా వెబ్ క్యామ్‌లో సినిమా తీశాం. కరోనా, లాక్డౌన్ సమయంలో తీశాం. బతుకుతామో లేదో అనే స్థితిలో ఉండేవాళ్లం. అప్పుడు పుట్టిన భయంలోంచే ఈ కథ వచ్చింది. ఎక్కడో దూరంలో ఉన్న నా కూతురు కష్టాల్లో ఉంటే ఎలా అని అనుకున్నా. అక్కడి నుంచి కథ ముందుకు వచ్చింది. తక్కువ మందితోనే షూటింగ్ చేశాం. ఆన్ లైన్లోనే నిర్మాత రవి గారు కథ విన్నారు. ఈ కథను నమ్మి మా మీద ఖర్చుపెట్టారు. కథ విన్న వెంటనే ఆదిత్ సినిమాను ఓకే చేశాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. అతని పర్పామెన్స్ చూసి షాక్ అయ్యాను. హీరోయిన్ శివానీ రాజశేఖర్‌ను మొదటి సారి కలిశాను. ఆమె అమాయకత్వం నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేయాలనే కసిని ఆమెలో చూశాను. ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఉంది. ఆమెకు అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టుంది. సందీప్ గురించి ఆదిత్ రిఫరెన్స్ ఇచ్చాడు. వీరప్పన్లా అనిపించలేదు. స్టోరీ లైన్ చెప్పినప్పటి నుంచే పాత్రలోకి వెళ్లిపోయాడు. ఆ పాత్ర నేను రాసినప్పుడు 25 శాతమే ఉంటే.. సందీప్ చేసిన తరువాత వంద శాతంగా మారింది. ఆయన ఈ ఇండస్ట్రీలో ఇంకా మున్ముందుకు వెళ్తారు. తమ్మిరాజు గారి ఎడిటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన లేకపోతే నాకు లోటుగా ఉంటుంది. బొమ్మ చేసి మనం సైమన్‌కు ఇస్తే దానికి జీవం పోస్తాడు. క్యాస్టూమ్స్, ఆర్ట్ వర్క్ నా భార్య పొన్మని చేసింది ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. కో ప్రొడ్యూసర్ విజయ్ ధరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. రిస్క్ టైంలోనూ అందరూ కూడా సినిమాకు బెస్ట్ ఇచ్చారు. మిర్చీ కిరణ్ గారితో 118తో చేశాను. నాలుగు సినిమాలు చేశాం. ఇంకా మున్ముందు కూడా చేస్తాం. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నిర్మాత కోసం ఈ సినిమాను చేయడం నాకు గర్వంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు ధాట్ల మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను ముందుండి నడిపించిన జీవిత, రాజశేఖర్ గారికి థ్యాంక్స్. కేవీ గుహన్ గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది. ఇలాంటి సమయంలో మనం ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నాం. మంచి టీం ఉందనే ధైర్యంతో మొదలుపెట్టాను. ఇండస్ట్రీ గురించి బయట ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా మంచి వారున్నారు. మా సినిమాను చూసి దిల్ రాజు గారు మెచ్చుకున్నారు. సురేష్ బాబు గారు మా సినిమాను చూసి ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఇండస్ట్రీకి బలం. ఆయన మా సినిమాను ఎంతో మెచ్చుకున్నారు. యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు మాతో మొదటి నుంచి కలిసి ప్రయాణం చేశారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్ గారు జంటకవులు. వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఇదొక మెమోరబుల్ జర్నీ. శివానీ, అదితి అద్బుతంగా నటించారు. అద్భుతం సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఈ ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. సినిమాను చూస్తుంటే కచ్చితంగా వేరే ప్రపంచంలోకి వెళ్తారు. కేవీ గుహన్ గారు అద్బుతంగా తెరకెక్కించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్, డైలాగ్ రైటర్ మిర్చీ కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ అద్భుతంగా పని చేశారు. ఈ సినిమాకు విజయ్ ఓ పిల్లర్. సోనీ లివ్‌లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను చూసి ఇంకా చాలా మంచి కథలు తీయాలి. మంచి దర్శకులు రావాలి’ అని అన్నారు.
హీరో అదిత్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను నాలుగు భాషల్లో నిర్మించి, విడుదల చేస్తున్నారు. కానీ ఆయన్ను చూడటం ఇదే రెండో సారి. మా మీద నమ్మకంతో ఈ సినిమాను చేశారు. నేను చాలా కింది స్థాయిలో ఉన్నప్పుడు నన్ను పైకి లేపింది గరుడ వేగ సినిమా. శివాత్మిక చాలా మాట్లాడుతుంది. శివానీ చాలా తక్కువ మాట్లాడుతుంది. సినిమాల్లోకి పంపించాలంటే తల్లిండ్రులు ఎక్కువగా భయపడుతుంటారు. కానీ జీవిత గారు, రాజ శేఖర్ గారు పిల్లలను ఎంతో బాగా పెంచారు. మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే పేరెంట్స్. అద్బుతం సినిమాలో కంటే WWWలో అద్భుతంగా నటించింది. పర్ఫామ్ చేసే ఫ్రెష్ నెస్ ఉన్న లోకల్ ఫ్లేవర్ హీరోయిన్ కావాలి అన్నారు. అప్పుడు శివాత్మికకు, శివానీకి చెప్పాం. అక్కకి బాగుంటుందని శివాత్మిక అన్నారు. ఇది నా పదిహేడో సినిమా. ఇది మొట్టమొదటి కంప్యూటర్ స్క్రీన్ థ్రిల్లర్. అద్భుతమైన సంగీతాన్ని అందించిన సైమన్ గారికి థ్యాంక్స్. ఆదిత్య మ్యూజిక్ వాళ్లు రైట్స్ కొన్న సమయంలో మాకు ఈ సినిమా మీద నమ్మకం వచ్చింది. సురేష్ బాబు గారి వల్లే సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ట్రైలర్ చూశారు. సోనీ లివ్‌లో డిసెంబర్ 24న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని కోరారు.
హీరోయిన్ శివానీ రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘అదిత్ వల్లే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు గుహన్ గారికి థ్యాంక్స్. ఇది నాకు చాలా మంచి అవకాశం. నిర్మాత రవి గారిని మొదటి సారిగా చూస్తున్నాను. విజయ్ గారు, ఆయన భార్య వైష్ణవి గారు నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. పొన్మణి గుహన్ మేడం గురించి చాలా మాట్లాడాలి. నా కోసం క్యాస్టూమ్స్ మాత్రమే కాదు ఎంతో బాగా వంటలు వండుకుని తీసుకొచ్చేవారు. అద్భుతం సినిమాలో, ఈ సినిమాలోనూ నాకు హీరోతో కాంబినేషన్ సీన్లు ఎక్కువగా ఉండవు. సైమన్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆయన సాంగ్స్ ఇప్పటికే హిట్ అయ్యాయి. బీజీఎంతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. మిర్చీ కిరణ్ గారు అద్బుతమైన మాటలు అందించారు. డిసెంబర్ 24న సోనీ లివ్‌తో మా సినిమా రాబోతోంది. మా అందరినీ ఆదరించాలి’ అని కోరుకున్నారు.
సంగీత దర్శకుడు సైమన్ కింగ్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి టీం, సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. టీం మొత్తానికి చాలా రుణపడి ఉంటాను. గుహన్ సర్ నాకు మంచి స్నేహితుడు. మేం చాలా ఏళ్ల నుంచి పని చేస్తూ వస్తున్నాం. శివానీ, అదిత్ అద్భుతంగా నటించారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చేసినప్పుడు వారి పర్ఫామెన్స్ చూశాను. లిరిక్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ప్రతీ రోజూ నిర్మాత రవి గారు నాకు ఫోన్ చేసేవారు. ఆ పాట బాగుంది.. ఈ పాట బాగుందని రోజూ మెచ్చుకునేవారు. ఆయన ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. సోనీ లివ్‌లో ఈ చిత్రం డిసెంబర్ 24న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘సైమన్ కింగ్ వల్లే ఈ సినిమాను తీసుకున్నాం. సైమన్ గారు ఓ సారి ఫోన్ చేశారు. గుహన్ గారి దర్శకత్వంలో, రవి గారి నిర్మాణంలో ఓ సినిమా రాబోతోందని చెప్పారు. వెంటనే రవి గారికి ఫోన్ చేసి ఈ మూవీ మ్యూజిక్ హక్కులు కొన్నాం. ఈ సినిమా కోసం రవి గారు ప్రతీక్షణం ఆలోచించారు. రాత్రిపగలు అని తేడా లేకుండా కష్టపడేవారు. సినిమానే ముఖ్యమని అనేవారు. జీవిత గారు కూడా ఫోన్ చేశారు. పాప సినిమాను జాగ్రత్తగా చేయండని అన్నారు. పాటలు అన్నీ హిట్ అయ్యాయి. సినిమా కూడా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా హిట్ అవుతుందని నాకు తెలుసు. అందుకే సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.
రైటర్ మిర్చీ కిరణ్ మాట్లాడుతూ..‘ఈ కథ లాక్డౌన్ నేపథ్యంలో జరుగుతుంది. లాక్డౌన్ సమయంలోనే లాక్డౌన్ కథను తయారు చేశాం. ఓ పక్కన కోవిడ్ భయం.. సినిమా రావాలని ఇంకొంత భయం. సినిమా కోసం ప్రయోగం చేశాం. హీరో అదిత్ అయితే డైరెక్షన్ టీం అన్నట్టుగా పని చేశాడు. శివ సినిమాతో రఘువరన్ దొరికినట్టు.. ఈ సినిమాతో సందీప్ దొరికాడు. సినిమా అందరికీ నచ్చుతుంది. గుహన్ గారితో 118తో పని చేశాను. ఇంకా బెటర్‌గా చేద్దామని అంటూనే ఉంటారు. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మున్ముందు ఇంకా ఆయనతో సినిమాలు చేయాలని ఉంది. ఈ చిత్రం సోనీ లివ్‌లో డిసెంబర్ 24న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నటుడు సందీప్ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. నన్ను ఈ సినిమాకు సూచించినందుకు అదిత్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. కరోనా సమయంలో ఎంతో కష్టపడి సినిమాను చేశాం. ఈ సినిమా డిసెంబర్ 24న ముందుకు రాబోతోంది. కరోనాలో ఎంత మంచి పని చేశామో, సినిమా తీశామో మీకు అర్థమవుతుందని’ అన్నారు.
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి…
సమర్ఫణ: సురేష్ ప్రొడక్షన్స్
బ్యానర్: రామంత్ర క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల
కో–ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దాట్ల
సంగీతం: సైమన్ కె. కింగ్
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: నిఖిల్ హాసన్
డైలాగ్స్: మిర్చి కిరణ్
లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్
స్టంట్స్: రియల్ సతీష్
కాస్ట్యూమ్ డిజైనర్: పొన్మని గుహన్
ప్రొడక్షన్ కంట్రోలర్: కె. రవి కుమార్