Akhanda Successfully Completes 50 Days In 103 Centres Posters
Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwaraka Creations Akhanda Successfully Completes 50 Days In 103 Centres
Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Sreenu’s is proving to be one of the craziest and successful combinations. The duo who previously delivered two blockbusters earlier with Simhaa, Legend have completed hat-trick hits in their combination. Like how Simhaa and Legend were biggest hits by the time for Balakrishna, Akhanda is ending as the highest grosser for the actor.
Meanwhile, Akhanda successfully completes 50 days run in 103 centres which is a rare feat in recent times, not just in Tollywood, but in entire Indian film industry. The film which was made on highest ever budget for Balakrishna has done a business of Rs 200 Cr which includes theatrical gross and non-theatrical revenue.
Akhanda indeed provided huge profits to producer as well all the distributors which again is another rare achievement in recent times. It was a profitable venture in overseas too. While it has done wonderful business in UK and Australia, the film crossed 1 million dollar mark in USA.
When there was so much uncertainty over theatrical business due to upsurge in omicron cases, Akhanda came and conquered the box office. Despite new releases every week, the mass action entertainer continued to make solid business. The film collected good numbers in its seventh week as well.
It’s the team work which resulted in an exceptional outcome. S Thaman’s background score is other biggest asset of the movie, other than C Ram Prasad’s cinematography and rich production values of Dwaraka Creations.
Pragya Jaiswal played the leading lady in the movie, while Srikanth played the antagonist and Jagapathi Babu appeared in a vital role.
103 కేంద్రాలలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ద్వారక క్రియేషన్స్ అఖండ.
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది. సింహ, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి ఇప్పుడు అఖండ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. సింహ, లెజెండ్ సినిమాలు అప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధిస్తే.. అఖండ మాత్రం కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ గ్రాస్ సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ఉన్న కాలంలో ఓ సినిమా యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడటం మామూలు విషయం కాదు. ఏకంగా 103 కేంద్రాలలో అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇది కేవలం టాలీవుడ్లోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమలోనే అరుదైన ఫీట్. బాలకృష్ణ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 200 కోట్లు రాబట్టింది.
ఈ మధ్య కాలంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్లోనూ చిత్రం లాభాల బాట పట్టింది. యూకే, ఆస్ట్రేలియాలో సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ రాగా అమెరికాలో ఏకంగా వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది.
ఒమిక్రాన్ కేసులు పెరిగినా, పరిస్థితులు బాగా లేకపోయినా కూడా అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రతీ వారం కొత్త సినిమాలు వచ్చినా కూడా అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే వచ్చింది. ఏడో వారంలో కూడా అఖండ మంచి వసూళ్లను రాబట్టింది.
టీం అంతా కలిసి అద్భుతంగా పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. బోయపాటి కథ, మేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్యను రెండు పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ లో చూపించిన విధానం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ద్వారక ప్రొడక్షన్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.
ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించారు. జగపతి బాబు ఓ ముఖ్య పాత్రను పోషించారు.