Telugu film industry Tribute to Superstar Krishna Garu
శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి (పవన్ కళ్యాణ్)
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు.
సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి – నిర్మాత
ఏ యం రత్నం
మెగా సూర్య ప్రొడక్షన్
శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం చాలా బాధ కలిగించింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వార్త తెలియగానే తమ చిత్రం ‘హరి హర వీరమల్లు‘ షూటింగ్ నిలుపుదల చేయటం జరిగింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు.
శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన తనయుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
– నందమూరి బాలకృష్ణ
‘ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”
వై. కాశీవిశ్వనాధ్
ప్రెసిడెంట్..
తెలుగు దర్శకుల సంఘం.
సూపర్ స్టార్ కృష్ణ గారు.. ఇకలేరు అనేది జీర్ణించుకోలేని నిజం. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. మహేష్ బాబు గారికి.. వారి కుటుంబానికి..
తెలుగు దర్శకుల సంఘం తరుపున.. మా ప్రగాఢ సానుబూతి తెలియజేస్తున్నాము.
సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు – అనిల్ కూర్మాచలం,
ఎఫ్దీసి చైర్మన్
తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు,అభిమానుకులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
వై. కాశీవిశ్వనాధ్ ప్రెసిడెంట్..
తెలుగు దర్శకుల సంఘం.
సూపర్ స్టార్ కృష్ణ గారు.. ఇకలేరు అనేది జీర్ణించుకోలేని నిజం. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. మహేష్ బాబు గారికి.. వారి కుటుంబానికి..
తెలుగు దర్శకుల సంఘం తరుపున.. మా ప్రగాఢ సానుబూతి తెలియజేస్తున్నాము.
-వీ.ఎన్.ఆదిత్య ప్రధాన కార్యదర్శి
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం
హైదరాబాద్.
సూపర్ స్టార్ కృష్ణ గారికి ఘన నివాళి..
“నటశేఖర” కృష్ణ గారు మొదటి వంద సినిమాలూ స్టార్ హీరో..
రెండు వందల చిత్రాలకు హీరో తో పాటు దర్శకుడు, ఎడిటర్, రచయిత, నిర్మాత..
మూడు వందల పైచిలుకు సినిమాల సమయానికి పైవాటన్నిటితో పాటు స్టూడియో అధినేత.
ఎవరెస్టంత ఎదుగుదలకి, భూదేవంత ఒదిగిన వినయానికి, నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ గారు.
తెలుగు సినిమా “సింహాసనం” మీద ఆయనే “నెంబర్ వన్ ” ..
“ఊరికి మొనగాడు” అనిపించుకున్న ఈ “బుర్రిపాలెం బుల్లోడు” ఇక లేడన్నది నమ్మలేకపోతున్నాం.. గుండె “అగ్ని పర్వతమై” జ్వలిస్తోంది..
తెలుగు సినిమాలని సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కించిన ఏకైక వ్యక్తి
శ్రీ ఘట్టమనేని శివరామకృష్ణ గారు.
ఆయన ఆత్మకు సద్గతులు కలుగు గాక.
ఆయన ఘనకీర్తి తెలుగు జాతి ఉన్నంతవరకూ ఆచంద్రతారార్కమై వెలుగొందు గాక..
ఓమ్ శాంతి
– ఎం ఆర్ వి ప్రసాద్, నిర్మాత
(పి బి ఆర్ట్స్)
మంచితనానికి మారు పేరు! కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి!!
సూపర్‌స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. యావత్ సినీ ప్రపంచం కృష్ణ మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తెలుగు చిత్ర సీమకి చెందిన ప్రముఖ నిర్మాత ఎం ఆర్ వి ప్రసాద్ (పి బి ఆర్ట్స్) స్పందించారు. ‘‘కృష్ణగారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనిది. మా బ్యానర్ లో కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణలతో సుల్తాన్ అనే చిత్రం నిర్మించడం జరిగింది. సుల్తాన్ మూవీ షూటింగ్ అండమాన్ దీవుల్లో జరిగిన్నన్ని రోజులు కృష్ణ గారితో విజయ నిర్మలగారు వున్నారు. వారితో గడిపిన రోజులు నా జీవితం లో మరచిపోలేని తీయని జ్ఞాపకాలు. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. ఈ రోజు కృష్ణగారు లేని లోటు చిత్ర పరిశ్రమకు, అభిమానులకు ఎప్పటికీ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతికి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఒకే ఏడాది లో అన్నయ్య రమేష్ బాబుని, ఇటీవలే తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న నా సోదురుడు మహేష్ బాబుకు ఈ కష్ట కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ..ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.