A solid tribute to ANR garu on his death anniversary
అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.!
గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.
ధర్మపత్ని సినిమాతో మొదలైన ఆయన కెరియర్ మనం సినిమా వరకు ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది,
జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది.
ఒక తరాన్ని తన నటనతో,స్టైల్ తో, స్టెప్స్ తో తీవ్రమైన ప్రభావానికి గురిచేసిన నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.
కృష్ణా జిల్లాలోని రామాపురం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆయన తన కృషి,సంకల్పంతో మద్రాసులో కష్టపడి నటుడుగా,కథ నాయకుడిగా ఎదిగి తనకంటూ ఒక స్థాయిని నిర్మించుకున్నారు.
లైలా మజ్ను,
దేవదాసు,
బాటసారి,
మూగమనసులు,
ప్రేమ్ నగర్,
ప్రేమాభిషేఖం,
మేఘ సందేశం
లాంటి ఎన్నో ప్రేమకథ సినిమాలు అతని కెరియర్ లో హిట్ కావడమే కాకుండా,
ప్రజల మనసుల్లో ఎప్పటికి మర్చిపోలేని ఒక స్థానాన్ని ఏర్పరిచాయి.
పద్మవిభూషణ్
పద్మభూషణ్
పద్మశ్రీ
దాదాసాహెబ్ పల్కె అవార్డు లాంటివి కాకుండా ఎన్నో అవార్డ్ లు అతనిని వరించాయి,ఎన్నో ప్రశంసలు ఆయన చేంత చేరాయి.!
ఆయన సినిమాలు ద్వారా మనకు మంచి అనుభూతులను, జ్ఞాపకాలను ఇవ్వడమే కాకుండా తన వారసులను కూడా ఇండస్ట్రీకి అందించి ఎనలేని సేవలు అందించిన అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా సిరిసినిమా తరుపున ఇవే మా ఘన నివాళులు.