A solid tribute to NTR garu on his death anniversary
నందమూరి తారకరామారావు
తెలుగు వాడిని,తెలుగు జాతిని శిఖరం మీద నిలబెట్టిన విశ్వ విఖ్యాత నటసౌర భౌముడు అతడు,
నటవిశ్వరూపం అనే పదానికి నిలువెత్తు రూపం అతడు,
అతడు ఏ పాత్ర తొడిగిన దానికి జీవం పోసాడు.
మన దేశం సినిమాతో మొదలు పెట్టిన ఆయన సినిమా ప్రయాణం మన మనసుల్లో చోటు సంపాదించడం వరకు జరిగింది.
ఒకటా రెండా ఎన్నో పాత్రలను
మరెన్నో సేవలు అందించారు తెలుగుజాతికి.
కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా నిమ్మకూరు లో పుట్టి,
నటుడిగా,దర్శకుడిగా తన కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన మహానుభావుడు,
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే అని నినాదించిన తెలుగు ప్రజల ఆరాధ్యదైవం,
వెండితెరపై కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్న ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది.
ఆంధ్రప్రదేశ్ 10 వ ముఖ్యమంత్రి గా ఆయన అందించిన సేవలు
బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆయనను దేవుణ్ణి చేసాయి.
తెలుగు సినిమా బ్రతికినంత కాలం ఆ పేరు వినిపిస్తుంది.
రాముడు,కృష్ణుడు అనే పేర్లు విన్నంతకాలం ఆయన రూపం కనిపిస్తోంది.
అన్నగారి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.!
జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.!✊