Aadavallu Meeku Johaarlu Movie Nati Kushboo Interview

ఆడవాళ్లు మీకు జోహార్లు కంప్లీట్ ఫ్యామిలీ సినిమా – నటి కుష్బూ.
-
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
-
రాధిక శరత్ కుమార్, కుష్బూ, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.మార్చి 4న ఈ చిత్రం విడుదలకానుంది.
-
ఈ సందర్భంగా నటి కుష్బూ మీడియాతో ముచ్చటించారు ఆవిశేషాలు…డైరెక్టర్ ఈ కథ చెప్తున్నప్పుడే రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కేవలం ఆడవాళ్లకు అనే కాదు హ్యూమన్ ఎమోషన్స్‌కి ప్రాముఖ్యత ఇస్తూ ఈ కథ రాశారు దర్శకుడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్అన్నీచక్కగాకుదిరాయి.కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు ఈ కాన్సెప్ట్ చాలా హిలేరియస్‌గా కూడా ఉంటుంది. ఆడవాళ్లు అంటే ఎక్కువగా గ్లిజరిన్‌తోనే పని ఉంటుంది అనుకుంటారు. ఈ సినిమాలో ఈ భావన తప్పు అని తెలుస్తుంది. వారు ఎందుకు హ్యాపీగా ఉండకూడదు అనే కోణం నుండి ఈ కథ రాశాడు.