Ala Vaikunthapurramuloo review
త్రివిక్రమ్ తీసుకొచ్చిన సంక్రాంతి – అల వైకుంఠపురంలో
నటీనటులు:అల్లు అర్జున్,పూజ హెగ్డే,సుశాంత్, నివేదా థామస్, సముద్రఖని,మురళీ శర్మ,టబు
దర్శకత్వం- త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు-అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ
సంగీతం-థమన్
సినిమాటోగ్రఫీ-పి.ఎస్. వినోద్
అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురంలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు తర్వాత వీళ్లద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఆ అంచనాలు సినిమా అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ:
బంటు(అల్లు అర్జున్) ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో పెరిగిన ఒక పెద్దింటి అబ్బాయి,
మధ్యతరగతి కుటుంబంలో ఉన్న బరువు బాధ్యతలు మోస్తూ తనపని చేసుకుంటూ ఉంటాడు,
ఉద్యోగం కోసం ఒక కంపెనీ కి వెళ్లడంతో అక్కడ పూజ హెగ్డే తో పరిచయం ఏర్పడుతుంది,
ఆ కంపెనీ లో ఉద్యోగానికి చేరిన బంటు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.?
అసలు పెద్దంటి లో పెరగాల్సిన బంటు ఈ ఫ్యామిలీ లో ఎందుకు పెరిగాడు.?
ఆ పెద్దంటికీ కష్టం వచ్చినప్పుడు బంటు వెళ్లి ఎలా రక్షించాడు.?
దూరమైన తల్లిదండ్రులకు ఎలా దగ్గరయ్యాడు.?
లాంటి విషయాలు అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
రెండు హిట్ సినిమాలు తర్వాత మూడోసారి బన్నీ,త్రివిక్రమ్ కలిసిచేస్తున్నా సినిమా కాబట్టి హ్యాట్రిక్ సాధిస్తుందా అనే డౌట్ తో ఉన్న సినీ ప్రేమికులకు ఇది హ్యాట్రిక్ అనే సమాధానాన్ని ఇచ్చింది.
కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చిన బన్నీ మాత్రం గట్టి హిట్ ను అందుకున్నాడు,
ప్రతీ సీన్ లోను తన నటనతో,కామెడీ టైమింగ్ తో చితక్కొట్టాడు,డాన్స్ లు అయితే ఖచ్చితంగా మనతో అరుపులు పెట్టిస్తాయి.సముద్రఖని విలన్ గా అద్భుతంగా చేశారు,మురళీ శర్మ తండ్రి పాత్రలో గుర్తుండిపోయే పెరఫార్మన్స్ ఇచ్చాడు.
టబు ,నివేధా పేతురాజ్,సుశాంత్ వీళ్ళందరు వాళ్ళ పరిధిలో చక్కగా చేశారు.
థమన్ సంగీతం సినిమాకి మంచి హైప్ ను తీసుకొస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బన్నీ ఎలివేషన్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
జనాలను ఎలా కూర్చోబెట్టాలి, థియేటర్ వరకు ఎలా తీసుకుని రావాలి,వాళ్లకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అని ఊహించి తీసాడు త్రివిక్రమ్ ఈ సినిమాని.ప్రతీ సీన్ అద్భుతంగా రాస్తే దానిని మరింత అందంగా చూపించారు సినిమాటోగ్రఫర్ పి.ఎస్.వినోద్.
మొత్తానికి ఈ సినిమా మీ ఫ్యామిలీ తో చూసి హాయిగా నవ్వుకునేలా ఉంది.
Rating:3/5