Alipiri allantha dooramlo Trailer launch
కాస్కేడ్ పిక్చర్స్ – రావణ్ నిట్టూరు- ఆనంద్ జె- ‘అలిపిరికి అల్లంత దూరంలో ” థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన దర్శకుడు మారుతి
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘మా తిరుపతి’ పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్లో విడుదలౌతుంది. దర్శకుడు మారుతి ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
హీరో రావణ్ మాట్లాడుతూ..‘అలిపిరికి అల్లంత దూరంలో ” నా మొదటి సినిమా. ట్రైలర్ ని లాంచ్ చేసిన మారుతికి గారికి కృతజ్ఞతలు. నాకు నాటకరంగంలో అనుభవం వుంది. దర్శకుడు ఆనంద్ జె ఈ కథని చెప్పి నేను ఆ పాత్రకి సరిపోతాని నన్ను ఎంపిక చేసుకున్నారు. ఆయనకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఫణి కళ్యాణ్, లిరిక్స్ విస్సా ప్రగడ, గాయకులు శంకర్ మహదేవన్ లాంటి ప్రతిభావంతులు వున్న ఈ చిత్రం చేయడం అనందంగా వుంది. నిర్మాతలు రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా అంతా తిరుపతిలోనే చేశాం. అక్కడే ఎందుకు చేశామో సినిమా చూస్తే తెలుస్తుంది. నవంబర్ 18న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.
హీరోయిన్ శ్రీ నికిత మాట్లాడుతూ.. అలిపిరికి అల్లంత దూరంలో పూర్తిగా తిరుపతిలో తీశాం. ఇది యునీక్ రాబరీ డ్రామా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రావణ్ చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులు కృతజ్ఞతలు. నవంబర్ 18న సినిమా విడుదలౌతుంది. చాలా కష్టపడి సినిమా చేసాం. అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.
నిర్మాత రెడ్డి రాజేంద్ర మాట్లాడుతూ.. దర్శకుడు రెడ్డి ఆనంద్ జె చాలా ప్యాషినేట్ ఈ సినిమా చేశారు. మేము నిర్మాణంలో కొత్త అయినప్పటికీ ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ లో ఆనంద్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సినిమాని చాలా మంచి ప్రతిభ గల సాంకేతిక నిపుణులు పని చేశారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ , ట్రైలర్ తో సినిమా పై మంచి బజ్ వచ్చింది. కంటెంట్ రిచ్ మూవీ ఇది. రాబారీ డ్రామాలో డివైన్ ఎలిమెంట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. మెగా ప్రొడక్షన్స్ సినిమాని పంపిణీ చేస్తోంది. సినిమా మేము అనుకున్నదాని కంటే అద్భుతంగా వచ్చింది. నవంబర్ 18న విడుదలౌతుంది. అందరూ థియేటర్లో చూడాలి” అని కోరారు.
నిర్మాత రమేష్ డబ్బుగొట్టు మాట్లాడుతూ.. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన మారుతి గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఆనంద్ జె చాలా అంకిత భావంతో సినిమాని తెరకెక్కించారు. నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాని అందరూ ఆదరించాలి” అని కోరారు.
దర్శకుడు ఆనంద్ జె మాట్లాడుతూ.. ఇది తిరుపతిలో జరిగే కథ. అందుకే ‘అలిపిరికి అల్లంత దూరంలో టైటిల్ పెట్టాం. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన మారుతి గారికి కృతజ్ఞతలు. మా నిర్మాతలు రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర గారికి థాంక్స్. నన్ను ఎంతగానో నమ్మారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. అందరం కొత్తవాళ్ళం కలసి చాలా ప్యాషనేట్ గా సినిమా చేశాం. సినిమా అంతా తిరుపతిలో షూట్ చేసాం. తిరుపతిలో యాత్రికుల మధ్య షూట్ చేయడం చాలా కష్టం. కానీ మా ప్రొడక్షన్ హార్డ్ వర్క్ వలన ఇది సాధ్యమైయింది. తిరుమలలో ఒక షాపు సంపాయించుకోవాలని చూసే ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారం ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రతి సీన్ లో వేంకటేశ్వర స్వామీ రిఫరెన్స్ వుంటుంది. అది ఎందుకుపెట్టామో క్లైమాక్స్ లో తెలుస్తుంది. తిరుపతి నేటివిటీని అద్భుతంగా చూపించాం. మా తిరుపతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేక్షకులు మా సినిమా ఆదరించి ప్రోత్సహించాలి” అని కోరారు.
ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలు రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్రకి కృతజ్ఞతలు. వారితో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ టైటిల్ లోనే పాజిటివ్ వైబ్స్ వున్నాయి. ఒక సవాల్ గా తీసుకొని మ్యూజిక్ చేసాం. మా తిరుపతి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో రావణ్, దర్శకుడు ఆనంద్.. చిత్ర యూనిట్ అందరికీ థాంక్స్” తెలిపారు.
నటీనటులు: రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ
టెక్నికల్ టీం :
దర్శకత్వం: – ఆనంద్ జె
నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్
డీవోపీ: డిజికె
సంగీతం : ఫణి కళ్యాణ్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : తేజస్వి సజ్జా